Shweta Tiwari : ఒక్కోసారి సినీ రంగానికి చెందిన నటీమణలు చేసే వ్యాఖ్యలు వైరల్ గా మారుతుంటాయి. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి ఓ టెలివిజన్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆమె మాజీ భర్తల గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు?
కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ రియాలిటీ షో పలువురిని ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రముఖ నటులు తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి శ్వేతా తివారి షోకు సంబంధించిన ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బాలీవుడ్ నటి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రోమోలో శ్వేతా తివారీతో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పే వ్యక్తులను నువ్వు గుర్తించలేవు’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన శ్వేత.. తన జీవితంలో జరిగిన అనుభవాలను ప్రస్తావిస్తూ సంచలన కౌంటర్ ఇచ్చారు. ‘నా భర్తలు ఛీట్ చేస్తుండగా నేనే పట్టుకున్నా’ అని ఆమె చెప్పడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు ప్రోమోలో కనిపించింది.
శ్వేతా తివారీకి గతంలో ఇద్దరితో వివాహాలు జరిగాయి. 1998లో నటుడు రాజా చౌదరి ను ఆమె వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె పాలక్ తివారీ ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత వీరి వివాహ బంధంలో విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్వేతా తివారీ 2013లో నటుడు అభినవ్ కోహ్లీ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రేయాన్ష్ ఉన్నారు. అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. 2019లో శ్వేత, అభినవ్ మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. దీంతో వీరు కూడా దూరమయ్యారు.
ఇలా తన జీవితంలో జరిగిన వాస్తవాల ఆధారంగానే ఆమె వాఖ్యలు చేసినట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఫుల్ షో వస్తేనే ఆమె ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో అర్థమవుతుంది. మోసం, నమ్మకం, వ్యూహాలు, రహస్యాలతో సాగే ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ రియాలిటీ షోలో కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రెండో సీజన్‌లో మొత్తం 21 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ షో 13 ఆగస్టు 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉండగా శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌గా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.