Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రానికి వచినటువంటి గ్రాస్ వసూళ్లు ట్రేడ్ విశ్లేషకులను సైతం షాక్ కి గురి చేసింది. రజినీకాంత్ కి పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విద్వంసం నెలకొంటుందో చెప్పడానికి ఈ సినిమా వసూళ్లే ఒక ఉదాహరణ. 76 ఏళ్ళ వయస్సులో కూడా నేటి తరం సూపర్ స్టార్స్ కూడా సాధించలేని అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ , సూపర్ స్టార్ ముందుకు దూసుకెళ్లే విధానం చూస్తుంటే , భవిష్యత్తులో ఇతన్ని మ్యాచ్ చేసే హీరో దొరకడం కష్టమే అని అనిపిస్తోంది.
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి మొదటి వారం నమోదైన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , తమిళనాడు నుండి 143 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 73 కోట్లు , కర్ణాటక రాష్ట్రం నుండి 62 కోట్లు , కేరళ నుండి 60 కోట్లు , నార్త్ ఇంద నుండి 36 కోట్లు , ఓవర్సీస్ నుండి 211 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 585 రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ చిత్ర నిర్మాతలు మాత్రం వచ్చిన వసూళ్ల కంటే తక్కువ చెప్తున్నారు. మొదటి వారం కేవలం 549 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సన్ పిక్చర్స్ సంస్థ వెల్లడించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని , ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ సినిమాకు 585 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నేటితో ఈ చిత్రం 600 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటనుంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలు , అన్ని భాషలకు కలిపి 302 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో 42 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగ్గా , మొదటి వారం లో 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 5 కోట్ల రూపాయిల లాభం అన్నమాట. ఓవరాల్ గా 585 కోట్ల గ్రాస్ వసూళ్లకు గాను 276 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే రావాలి. రేపటితో ఈ చిత్రం ఆ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం 1000 కోట్ల మార్కుని అందుకుంటుందో లేదో చూడాలి.