Bigg Boss 10 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ‘ టాస్కులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో అమన్, నీతూ మాస్టర్ మరియు దేబ్జాని వంటి వారు అద్భుతంగా టాస్కులు ఆడి గెలిచి , గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గా నిల్చి , వచ్చే రెండు వారాలు నామినేషన్స్ నుండి సేవ్ అవ్వగా, నేడు ముకేశ్ ఆ క్యాటగిరీలో చేరాడు. ‘గోట్ ఆఫ్ కామన్ సెన్స్’ పేరుతో నిర్వహించిన ఈ టాస్క్ లో ముకేశ్ 7 పాయింట్స్ ని రాగా, త్రిగున్ కి 4 , శివ్ కి 3 , నరేష్ కి రెండు పాయింట్స్ వచ్చాయి. ఇక వర్షిణి , ఆటో రామ్ ప్రసాద్ లకు జీరో పాయింట్స్ వచ్చాయి. అయితే తనకు తానూ గొప్ప మాస్టర్ మైండ్ గా చెప్పుకొని తిరిగే త్రిగున్ , ఈ కామన్ సెన్స్ టాస్క్ లో ముకేశ్ కి దరిసపుల్లోకి రాకపోవడం గమనార్హం.
ఆ నాలుగు పాయింట్స్ కూడా అతనికి మంచి గ్రిప్ ఉన్న సినిమా కారణంగా వచ్చినవే. లేకపోతే ఇవి కూడా ముకేశ్ గెలిచేవాడని అంటున్నారు నెటిజెన్స్. మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో ముకేష్ , త్రిగున్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నిన్నటి టాస్క్ లో కూడా త్రిగున్ ముకేశ్ ని , ముకేశ్ త్రిగున్ ని టార్గెట్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ సందర్భం లో త్రిగున్ పై ముకేశ్ ఈ రేంజ్ మార్జిన్ తో గెలవడం పై ముకేశ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరో పక్క రోహిత్ ఫ్యాన్స్ ఈ వారం మొత్తం డల్ అయిపోయారు.
ఎందుకంటే ఆరంభం లోనే రోహిత్ ని రెడ్ బ్లాక్ లో పెట్టడం , ఆ తర్వాత మొదటి రెండు రౌండ్స్ కే ఆటో రామ్ ప్రసాద్ రోహిత్ ని తొలగించడంతో ఈ వారం మొత్తం ఒక్కటంటే ఒక్క టాస్క్ కూడా ఆడే అవకాశం రోహిత్ కి రాలేదు. దీంతో అసలు రోహిత్ ని బాగా ఆడట్లేదని రెడ్ బ్లాక్ లో పెట్టడం ఏంటో , వర్షిణి బాగా ఆడుతుందని ఎల్లో బ్లాక్ లో పెట్టడం ఏంటో అని సోషల్ మీడియా లో విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ టీం పై మండిపడుతున్నారు. వర్షిణి కి నిన్న , ఈరోజు టాస్కులు ఆడే అవకాశం వచ్చింది. తన వైపు నుండి కనీస స్థాయిలో కూడా ఆడలేకపోయింది. ఇక సంచాలక్ గా అయితే చాలా వరస్ట్ గా చేసింది , ఇలాంటి కంటెస్టెంట్ ని బిగ్ బాస్ టీం వెనకేసుకొని వస్తుందని , బాగా ఆడే రోహిత్ ని టార్గెట్ చేసి మరీ తొక్కేస్తున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.