Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్నిపరీక్ష 2’ నుండి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన అపూర్వ నిన్న ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎలిమినేట్ అయ్యాక ఈమె ఇచ్చిన ‘బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ’ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా శివాజీ తో అపూర్వ గొడవ పడే రేంజ్ లో వాదించడం, అందుకు శివాజీ ఫైర్ అవ్వడం, అపూర్వ అయోమయానికి గురి అవ్వడం వంటివి జరిగాయి. ఇప్పటి వరకు బజ్ ఇంటర్వ్యూ లో శివాజీ ఈ రేంజ్ లో ఏ కంటెస్టెంట్ మీద కూడా ఫైర్ అవ్వలేదు. అలాంటిది అపూర్వ మీద ఇంతలా ఫైర్ అవ్వడం తో ఆడియన్స్ కూడా షాక్ కి గురయ్యారు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ అపూర్వ చేసే ట్రోల్స్ , కామెంట్స్ ని ఆమె ముందుకు తీసుకొచ్చి , దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి అని అడుగుతాడు శివాజీ.
అందుకు అపూర్వ ఫైర్ అవుతుంది. శివాజీ కూడా అదే రేంజ్ లో రియాక్షన్ ఇస్తూ , ‘పోనీ నేను నీ స్థానం లో కూర్చుంటే , నువ్వే ఇంటర్వ్యూ చేసుకో, సైలెంట్ గా ఉంటాను, నీకు గొడవే కావాలంటే , కచ్చితంగా గొడవే ఇస్తాను, అందులో ఎలాంటి మొహమాటం లేదు , సోషల్ మీడియా లో జనాలకు నీ గురించి అనుకునేవి నీ ముందు ఉంచినప్పుడు , దానికి నువ్వు ఇచ్చే జవాబులతో వాళ్లకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకు నువ్వు సీరియస్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్’ అని శివాజీ ఫైర్ అయ్యాడు. ఆయన మాట్లాడుతున్నంత సేపు అపూర్వ అలా చూస్తూ ఉండిపోయింది. ఈ ఇంటర్వ్యూ చూసి , ఇందుకే కదా నిన్ను హౌస్ మేట్స్ భరించలేకపోయారు , ఆడియన్స్ కూడా భరించలేక ఎలిమినేట్ చేశారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే అపూర్వ రెండు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు , అదే విధంగా ‘అగ్ని పరీక్ష 2’ ఎపిసోడ్స్ మొత్తానికి కలిపి 2 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. ఇక నేడు ఆమె జియో హాట్ స్టార్ లైవ్ లో కాసేపు కామెంట్ సెక్షన్ లో ప్రేక్షకులతో సంభాషించింది. ఆ సంభాషణలో నేను , చరణ్ , అమన్ మంచి స్నేహితులం అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.