Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ కి మహర్థశ పట్టిస్తున్న పవన్ కళ్యాణ్...

Pawan Kalyan: హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ కి మహర్థశ పట్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!

Pawan Kalyan: సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కనమరుగు అవుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హైదరాబాద్ లోని పలు సింగల్ స్క్రీన్ థియేటర్స్ కి మంచి క్రేజ్ ని తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత సినిమాలను రీ రిలీజ్ అయిన ప్రతీసారి పవన్ ఫ్యాన్స్ కొన్ని థియేటర్స్ ని ఎంచుకొని వేరే లెవెల్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసేవారు. అలా ఇప్పటికే సాయి రామ్, భుజంగా థియేటర్స్ ని ఫేమస్ చేశారు. ఇప్పుడు ఆరాధన […]

Pawan Kalyan: సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కనమరుగు అవుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హైదరాబాద్ లోని పలు సింగల్ స్క్రీన్ థియేటర్స్ కి మంచి క్రేజ్ ని తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత సినిమాలను రీ రిలీజ్ అయిన ప్రతీసారి పవన్ ఫ్యాన్స్ కొన్ని థియేటర్స్ ని ఎంచుకొని వేరే లెవెల్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసేవారు. అలా ఇప్పటికే సాయి రామ్, భుజంగా థియేటర్స్ ని ఫేమస్ చేశారు. ఇప్పుడు ఆరాధన థియేటర్ ని ఫేమస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఆరాధన థియేటర్ లో పంజా మూవీ రీ రిలీజ్ కి అదిరిపోయే రేంజ్ లో సెలబ్రేషన్స్ చేశారు.

ఇక నిన్న పవనిజం డే సందర్బంగా ఆరాధన లో గబ్బర్ సింగ్, ఓజీ చిత్రాలను ప్రదర్శించారు. వీటికి సంబందించిన సెలెబ్రేషన్స్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. దీన్ని చూసి ఇప్పుడు ఇతర హీరోల అభిమానులు కూడా ఆరాధన థియేటర్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ అక్టోబర్ 23 న పుట్టిన రోజు సందర్భంగా విడుదల అవుతున్న వర్షం , ఛత్రపతి సినిమాలకు రీసెంట్ గానే ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. అక్టోబర్ 23 న కనీవినీ ఎరుగని రేంజ్ లో థియేటర్ వద్ద సెలబ్రేషన్స్ ని కూడా ప్లాన్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. 2013 వ సంవత్సరం వరకు ఆరాధనా థియేటర్ కి మంచి క్రేజ్ ఉండేది కానీ , ఆ తర్వాత మాత్రం బాగా తగ్గిపోయింది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఈ థియేటర్ పేరుని మారుమోగిపోయేలా చేయడం తో , ఇకపై ప్రతీ స్టార్ హీరో అభిమానులు ఈ థియేటర్ లో సంబరాలు చేసేలా ప్లానింగ్ చేసుకుంటారని అంటున్నారు విశ్లేషకులు.

భవిష్యత్తులో హైదరాబాద్ లోని మరికొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని కూడా పవన్ ఫ్యాన్స్ ఫేమస్ చేస్తారని , వాటిల్లో ముఖ్యంగా కూకట్ పల్లి పరిసరాల్లో ఉండే థియేటర్స్ ఉంటాయని అంటున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా , అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సంస్కృతి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బ్రతుకుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కెరీర్ అండర్ రేటెడ్ మూవీ గా ఉన్న ‘బాలు’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు అట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper