Homeఎంటర్టైన్మెంట్Shanmukh Jaswanth- Deepthi Sunaina: మళ్ళీ కలిసిపోయిన దీప్తి-షణ్ముఖ్... పెళ్లి టాపిక్ తెరపైకి తెచ్చి స్వయంగా...

Shanmukh Jaswanth- Deepthi Sunaina: మళ్ళీ కలిసిపోయిన దీప్తి-షణ్ముఖ్… పెళ్లి టాపిక్ తెరపైకి తెచ్చి స్వయంగా క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ! 

Shanmukh Jaswanth- Deepthi Sunaina: షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునైన విడిపోయి ఏడాది దాటిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేశాడు. ఫ్రెండ్ పేరుతో వీరు హౌస్లో ప్రేమాయణం నడిపారు. సిరి పట్ల షణ్ముఖ్ చాలా పొసెసివ్ గా ఉండేవాడు. హౌస్లో మరో కంటెస్టెంట్ తో సిరి మాట్లాడితే తట్టుకునేవాడు కాదు. మానసికంగా సిరిని షణ్ముఖ్ బాగా వేధించాడు. అప్పుడప్పుడు సిరి కోపంగా బాత్ రూమ్ కి వెళ్లి ఏడ్చేది. తలను గోడకు బాదుకోబోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎంత తిట్టుకున్నా మరలా కలిసిపోయే వారు.

Shanmukh Jaswanth- Deepthi Sunaina
Shanmukh Jaswanth- Deepthi Sunaina

ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన వీరి వ్యవహారం బిగ్ బాస్ షోకి హైలెట్ అయ్యింది. ఇక హౌస్లో ఉన్న షణ్ముఖ్ ని కలిసేందుకు బిగ్ బాస్ వేదికపైకి సునైన వచ్చింది. అతనితో చాలా ప్రేమగా మాట్లాడింది. దీంతో షణ్ముఖ్-సిరి సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం తనని హర్ట్ చేయలేదని అందరూ భావించారు. షణ్ముఖ్ గెలుపుకోసం బయట దీప్తి  పెద్ద ఎత్తున క్యాంపైన్ చేసింది. అయితే షణ్ముఖ్ రన్నర్ తో సరిపెట్టుకున్నాడు.

షో ముగిసి షణ్ముఖ్ బయటకు వచ్చాక బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఓ రోజు దీప్తి సునైన స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. కారణాలు మాత్రం ఆమె చెప్పలేదు. సిరి కారణంగానే షణ్ముఖ్-దీప్తి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై సిరి కూడా స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేశారు. బ్రేకప్ తర్వాత ఎవరి దారిన వాళ్ళున్నారు.

Shanmukh Jaswanth- Deepthi Sunaina
Shanmukh Jaswanth- Deepthi Sunaina

 

సడన్ గా దీప్తి మాజీ ప్రియుడితో కలిసి సాంగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. షణ్ముఖ్ నేను కలిసి ఒక ఆల్బమ్ చేస్తున్నాము. త్వరలో ఈ ఆల్బమ్ విడుదల కానుందని ప్రకటించింది. ఏడాది కాలంగా దూరంగా ఉంటున్న ఈ జంట కలిసి వీడియోలు చేస్తున్నామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కలయిక కేవలం ప్రొఫెషన్ కోసమా లేక ప్రేమ కోసమా అర్థం కావడం లేదు. అయితే గత అనుభవాల రీత్యా నా జీవితం నా చేతిలోనే ఉంటుందని దీప్తి అన్నారు. నెక్స్ట్ సాంగ్ లో నాకు పెళ్లి అవుతుందా… కాదా?. మీరే చూడండి అంటూ సస్పెన్సు లోకి నెట్టింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper