Homeఎంటర్టైన్మెంట్Shambhala Movie 2 Days Collections: 'శంబాలా' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్...

Shambhala Movie 2 Days Collections: ‘శంబాలా’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ మార్కు కి అతి చేరువలో!

Shambhala Movie 2 Days Collections: 2025 వ సంవత్సరం చిన్న సినిమాలకు గోల్డెన్ ఇయర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఆశల మధ్య విడుదలైన భారీ చిత్రాలు మిశ్రమ ఫలితాలను అందుకుంటే, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం బయ్యర్స్ కి ఈ ఏడాది భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. ఏడాది ప్రారంభం లో ఇలాగే ఉన్నింది, ఏడాది చివర్లో కూడా అలాగే ఉంది. క్రిస్మస్ కానుకగా నాలుగు […]

Shambhala Movie 2 Days Collections: 2025 వ సంవత్సరం చిన్న సినిమాలకు గోల్డెన్ ఇయర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఆశల మధ్య విడుదలైన భారీ చిత్రాలు మిశ్రమ ఫలితాలను అందుకుంటే, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం బయ్యర్స్ కి ఈ ఏడాది భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. ఏడాది ప్రారంభం లో ఇలాగే ఉన్నింది, ఏడాది చివర్లో కూడా అలాగే ఉంది. క్రిస్మస్ కానుకగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో ఆది శివకుమార్ హీరో గా నటించిన ‘శంబాలా'(Sambhala Movie) మూవీ కమర్షియల్ గా బయ్యర్స్ కి బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ లతో ఈ చిత్రం ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆకాశం నుండి ఒక ఆస్ట్రోనట్ ఒక గ్రామం లో పడడం, దానిని గ్రామా ప్రజలు దైవ శక్తికి గా బావిచడం, ఇలా సైన్స్ మరియు దైవ భక్తికి మధ్య జరిగే పోరాటం లాగా ఈ ట్రైలర్ లో చూపించారు.

సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేలా ఉంది అనే ఫీలింగ్ ప్రమోషనల్ కంటెంట్ తోనే పుట్టించడం లో మేకర్స్ సక్సెస్ అయ్యారు. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు, మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అనుకున్న దానికంటే మేకర్స్ ఈ చిత్రాన్ని బాగా తీశారు, ఇలాంటి కొత్త తరహా సినిమాల కోసమే మేము ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. అయితే టాక్ కి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. వాళ్ళు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 2 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 1 కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక రెండవ రోజు అయితే ఈ చిత్రానికి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా బుక్ మై షో యాప్ లో 22 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ఓవరాల్ వరల్డ్ వైడ్ గా రెండవ రోజు కోటీ 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం సొంతం చేసుకోగా, షేర్ వసూళ్లు 95 లక్షల రూపాయిల వరకు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 5 కోట్లు మాత్రమే. అంటే ఇక కేవలం 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యినట్టే. ఈ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సోమవారం నుండి ఇక బయ్యర్స్ లాభాలు లెక్కపెట్టుకోవడమే, మొత్తానికి ఆది శివకుమార్ చాలా కాలం తర్వాత ఒక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper