Homeఎంటర్టైన్మెంట్Shah Rukh Khan In Jailer 2: 'జైలర్ 2' సెట్స్ లోకి...

Shah Rukh Khan In Jailer 2: ‘జైలర్ 2’ సెట్స్ లోకి అడుగుపెట్టిన షారుఖ్ ఖాన్.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Shah Rukh Khan In Jailer 2: ‘కూలీ’ వంటి భారీ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) చేస్తున్న ‘జైలర్ 2′(Jailer 2 Movie) పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘జైలర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి ముందు రజినీకాంత్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఎంతలా అంటే […]

Shah Rukh Khan In Jailer 2: ‘కూలీ’ వంటి భారీ చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) చేస్తున్న ‘జైలర్ 2′(Jailer 2 Movie) పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘జైలర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి ముందు రజినీకాంత్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఎంతలా అంటే , ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా పై ట్రేడ్ వర్గాలు అనుమానం చూపించే రేంజ్ లో అన్నమాట. అలాంటి పరిస్థితి నుండి ఎవ్వరూ ఊహించనంత భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి , రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో నేటి తరం ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే అంచనాలు ఆ మాత్రం ఉండడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఇకపోతే ‘జైలర్’ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ స్టామినా, డైరెక్టర్ టేకింగ్ అయితే , మరో ముఖ్య కారణం స్పెషల్ క్యామియో రోల్స్. ఈ చిత్రం లో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పాత్రలు మామూలు రేంజ్ లో పేలలేదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సన్నివేశం లో శివరాజ్ కుమార్ ఎంట్రీ కి థియేటర్స్ బద్దలు అయిపోయాయి. రజినీకాంత్ కి మించిన రెస్పాన్స్ వచ్చింది. ‘జైలర్ 2’ లో కూడా వీళ్లిద్దరు కనిపించబోతున్నారు. రీసెంట్ గానే మోహన్ లాల్ కి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేశారట మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది . నేడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సెట్స్ లోకి అడుగుపెట్టాడట. ఈ చిత్రం లో ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో , 15 నిమిషాల స్క్రీన్ టైం తో ‘జైలర్ 2’ చిత్రం లో మెరవబోతున్నాడు కింగ్ ఖాన్. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం నందమూరి బాలకృష్ణ ని సంప్రదించారు మేకర్స్. కానీ ఆయన రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడం తో, మేకర్స్ కింగ్ ఖాన్ ని సంప్రదించడం , ఆయన రజినీకాంత్ మీద ఉన్నటువంటి అపారమైన గౌరవం , అభిమానం తో ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకోవడం వంటివి జరిగిందట. రజినీకాంత్ గత చిత్రం ‘కూలీ’ లో అమీర్ ఖాన్ నటించడం , ఇప్పుడు ‘జైలర్ 2’ లో షారుఖ్ ఖాన్ నటించడం విశేషం. ఇలా వరుసగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ , రజినీకాంత్ సినిమా అనగానే క్షణం కూడా ఆలోచించకుండా , పైసా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నారంటే , ఆయన ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper