Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other Show Viral Video: భార్య భర్తలను విడదీసిన 'మ్యాడ్ ఫర్...

Mad For Each Other Show Viral Video: భార్య భర్తలను విడదీసిన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో.. వీడియో వైరల్..

Mad For Each Other Show Viral Video: స్టార్ మా ఛానల్ లో రీసెంట్ గానే మొదలైన రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ కి ఆరంభం లో కాస్త మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఎపిసోడ్స్ గడిచే కొద్దీ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ని కనబరుస్తూ, మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ షో లో నిర్వహిస్తున్న గేమ్స్ , బిగ్ బాస్ షోలో నిర్వహించే […]

Mad For Each Other Show Viral Video: స్టార్ మా ఛానల్ లో రీసెంట్ గానే మొదలైన రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ కి ఆరంభం లో కాస్త మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఎపిసోడ్స్ గడిచే కొద్దీ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ని కనబరుస్తూ, మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ షో లో నిర్వహిస్తున్న గేమ్స్ , బిగ్ బాస్ షోలో నిర్వహించే గేమ్స్ కంటే కఠినంగా ఉన్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. హరిత – హరీష్ జంట మొదట ఎలిమినేట్ అవ్వగా, గత వారం మహేష్ – సాండ్రా జంట ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం అయితే వారం రోజుల పాటు భార్య భర్తలను విడదీస్తూ హౌస్ లోనే ఒక పెద్ద గోడని ఏర్పాటు చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో మీరు దీనిని చూడొచ్చు.

విడదీసిన తర్వాత భార్యలు మామూలుగానే ఉన్నారు కానీ , భర్తలు మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా ఆడియన్స్ కి అనిపిస్తోంది. ఏంటో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వీళ్ళు వేరువేరుగా లేనట్టు, కేవలం ఈ ఒక్క షో లోనే దూరంగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నట్టుగా అనిపించింది. షూటింగ్స్ కోసం అప్పుడప్పుడు వారం , లేదా పది రోజులు బయటకు వెళ్లే సందర్భాలు, అక్కడ హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరికి వచ్చే ఉంటుంది, అయినప్పటికీ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకో అర్థం కావడం లేదని అంటున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే కనీసం గంట సేపు కూడా వాసంతి ని వదిలి ఉండలేనట్టుగా ప్రవర్తించాడు. ఇలా అయితే నా వల్ల కాదు, నేను ఈ షో వదిలి వెళ్ళిపోతా అంటూ ఆయన నిన్న చేసిన పెర్ఫార్మన్స్ కెమెరా కోసమే చేసినట్టుగా అనిపించింది.

ఇదంతా పక్కన పెడితే హౌస్ లో ఏర్పాటు చేసిన ఆ గోడని దాటుకొని తమ పార్టనర్స్ ని చేరుకోవాలంటే కొన్ని టాస్కులు ఆడాల్సి ఉంటుంది. ఆ టాస్కులు గెలిచిన తర్వాత తమ పార్టనర్స్ ని కలుసుకోవచ్చని యాంకర్ శ్రీముఖి అంటుంది. కాసేపటి క్రితమే ఈ టాస్కులకు సంబంధించిన ఒక ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో శివ్ ఒక టాస్క్ లో గెలిచి , తన ప్రేయసి ప్రియాంక ని కలుసుకుంటాడు. శివ్ లాగా నువ్వు ఎందుకు ఆడలేకపోయావు అని నీతూ నటరాజ్ మాస్టర్ ని అడగడం , అందుకు నటరాజ్ మాస్టర్ ఫీల్ అయ్యి వెళ్లిపోవడం వంటివి ఈ ప్రోమో లో చూడొచ్చు. దీనిని చూస్తుంటే నేటి ఎపిసోడ్ మంచి రసవత్తరంగా సాగేలా అనిపిస్తోంది.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper