Anchor Rashmi: బుల్లితెర పై స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి రష్మీ. ‘జబర్దస్త్’ షో తో ఈమెకు ఒక పక్క యూత్ ఆడియన్స్ లో , మరో పక్క ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆ షో పెద్ద హిట్ అవ్వడం తో ఈటీవీ , జీ తెలుగు , స్టార్ మా ఇలా అన్ని చానెల్స్ లోనూ రష్మీ కి యాంకర్ గా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ఈటీవీ లో అయితే ప్రతీ పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోలో రష్మీ యాంకర్ గా కనిపించేది. ఇలా యాంకర్ గా ఆమెకు వచ్చిన ఫేమ్ కారణంగా సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఆమె హీరోయిన్ గా నటించిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ , అవి పెద్దగా సక్సెస్ సాధించలేదు.
సినిమాల్లో సక్సెస్ రేట్ పెద్దగా రాకపోయినా , యాంకర్ గా మాత్రం ఆమె కెరీర్ పీక్ రేంజ్ లోనే కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ యాంకరింగ్ అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఈటీవీ లో ఈమె రెగ్యులర్ గా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘జబర్దస్త్’ వంటి షోస్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి ఈమెని తీసేసి ప్రదీప్ ని పెట్టుకున్నారు. ఇది రష్మీ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పుడు కేవలం ఆమె ‘జబర్దస్త్’ షో కి మాత్రమే యాంకర్ గా కొనసాగుతుంది. ఈ షో ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అదే కనుక జరిగితే రష్మీ ని ఇక మనం బుల్లితెర మీద చూడడం కష్టం. ఉదయభాను , ఝాన్సీ , శిల్పా రావు వంటి యాంకర్స్ ఎలా అయితే కనిపించకుండా పోయారో , రష్మీ కూడా అదృశ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇంతటి క్రేజ్ ఉన్న రష్మీ కి అవకాశాలు తగ్గడానికి కారణం ఏంటి?, సుడిగాలి సుధీర్ , యాంకర్ ప్రదీప్ వంటి వారు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండడం వల్లేనా?, లేదంటే ఆమెకు అవకాశాలు రానివ్వకుండా ఎవరైనా తొక్కేస్తున్నారా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే , టాలీవుడ్ కి చెందిన ఒక టాప్ డైరెక్టర్ రష్మీ కి అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారని టాక్. ఆ టాప్ డైరెక్టర్ కి కెరీర్ మొత్తం మీద హిట్స్ ఉన్నాయట , పలు టీవీ షోస్ కి ఆయన న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించాడట?, మరి ఆ డైరెక్టర్ ఎవరు?, ఎందుకు రష్మీ మీద పగబట్టి ఆమెకు అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.