Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ ఆ స్టార్ హీరోను కొట్టడా..? కారణమేంటంటే..?

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ ఆ స్టార్ హీరోను కొట్టడా..? కారణమేంటంటే..?

Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్య కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ తో ప్రేక్షకులను రంజింపజేస్తాడు. ఆయన సినిమాలో బోల్డ్ సీన్స్ కావాలని పెట్టడు కథ డిమాండ్ చేస్తుంది కాబట్టి అలాంటి సీన్స్ వస్తుంటాయి. ఇక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలను చాలా డిఫరెంట్ గా ప్రజంట్ […]

Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్య కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ తో ప్రేక్షకులను రంజింపజేస్తాడు. ఆయన సినిమాలో బోల్డ్ సీన్స్ కావాలని పెట్టడు కథ డిమాండ్ చేస్తుంది కాబట్టి అలాంటి సీన్స్ వస్తుంటాయి. ఇక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలను చాలా డిఫరెంట్ గా ప్రజంట్ చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. నిజానికి సందీప్ వంగ ఒక డిఫరెంట్ మేకర్ అనే విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే మంచిది. ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ను డైరెక్షన్ చేస్తున్న ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…సందీప్ రెడ్డివంగ విషయం మనకు తెలిసిందే. ఆయన చాలా సీరియస్ గా ఉంటాడు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా విషయానికి సంబంధించిన ఆన్సర్ అడిగినప్పుడు ఆయన చాలా సీరియస్ గా సమాధానం చెబుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘అనిమల్’ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఒక సీన్ కి రన్బీర్ కపూర్ సరైన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే సందీప్ తను రన్బీర్ మీదకి కొంత సీరియస్ అయ్యాడట.

Also Read: యుద్ధంలోకి మరో రెండు దేశాలు.. ఇరాన్‌కు మరిన్ని కష్టాలు!

అది అలా కాదు ఇలా చేయమని అతని తల మీద చిన్నగా కొట్టి మరి అతనికి ఆ సీన్లు ఎక్స్ప్రెషన్స్ చెప్పారట. ఇక రన్బీర్ కపూర్ కూడా సందీప్ ఇరిటేట్ అవుతున్నాడు మనం ఈసారి పక్కాగా చేయాలనే ఉద్దేశ్యంతో చాలా పకడ్బందీగా ఆ సీన్ చేశారట. ఇంతకీ ఆ సీన్ ఏంటి అంటే అనిల్ కపూర్ తో రన్బీర్ కపూర్ మాట్లాడుతూ మైకల్ జాక్సన్ కన్సర్ట్ గురించి డిస్కస్ చేసే సీన్ అని తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ మేకింగ్ విషయంలో చాలా క్లారిటిగా ఉంటాడు. ఏ చిన్న తప్పు లేకుండా సినిమాని చాలా క్లారిటీగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అందువల్లే ఆయన టాప్ డైరెక్ట్ గా మారాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తతో ముందుకు సాగుతున్నాడు.

ప్రభాస్ ని సైతం చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట…ఇక రన్బీర్ కపూర్ ను అనిమల్ సినిమాలో ఏ రేంజ్ లో చూపించాడో మనందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ ను సైతం అదే రేంజ్ లో చూపించడానికి సిద్ధమవుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper