మధ్యప్రాచ్య యుద్ధం విస్తరిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మొదలు పెట్టాడు. కానీ, తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలో ఇరాన్ వద్ద అణ్వాయుధాలు గతేడాదే ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతో ఇరాన్‌లో రెజీమ్ చేంజ్ కోసమే ట్రంప్ యుద్ధం మొదలు పెట్టాడని అర్థమైంది. అయితే యుద్ధం మొదలై 23 రోజులైనా ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. సుప్రీం లీడర్ ఖమేనీతోపాటు కీలక నేతలు మరణించినా ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికాను ఆర్థికంగా ఇబ్బంది పెడుతోంది. ఒకవైపు గల్ఫ్‌దేశాల్లోని అమెరికా స్థారవాలపై దాడిచేస్తూనే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల ఆయిల్ ప్లాంట్లు వాటర్ ప్లాంట్లను టార్గెట్ చేస్తోంది. అమెరికాకు ఆశ్రయం ఇచ్చినందుకే తాము దాడుల చేస్తున్నట్లు ఇరాన్ చెబుతోంది. తమకు గల్ప్ దేశాలపై ఎలాంటి కోసం, శత్రుత్వం లేదని పేర్కొంటోంది. అయితే రోజు రోజుకు ఇరాన్ దాడులు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థికంగా దెబ్బతిన్న సౌదీ అరేబియా యుద్దంలోకి రావాలని పాకిస్తాన్‌ను కోరింది. డిఫెన్స్ డీల్‌లో భాగంగా తమ తరఫున పోరాడలని అడిగింది. కానీ పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్ దాడులను సాకుగా చూపి తప్పించుకుంటోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా నేరుగా యుద్ధంలోకి ఎంటర్ అయింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి నేరుగా ఇరాన్ ఇంధన లక్ష్యాలను టార్గెట్ చేసే అవకాశం ఉంది.
అమెరికాకు యుద్ధ బేస్‌లు..
సౌదీ తన వైమానిక స్థావరాలను అమెరికాకు అందజేయడానికి అంగీకరించింది, ఇది ఇరాన్‌పై మరింత దాడులకు మార్గం సుగమం చేస్తుంది. యూఏఈ, టెహ్రాన్‌కు చెందిన సంస్థలను మూసివేసి, ఇరాన్ ప్రమాదాలను తగ్గించుకుంటోంది. ఖతార్, బహ్రెయిన్, కువైట్‌తో కలిసి ఆరు దేశాలు సంయుక్త హెచ్చరికలు జారీ చేశాƇు.
ఇరాన్ దాడుల ప్రభావం
ఇరాన్ గల్ఫ్ ఇంధన మౌలిక సదుపాయాలు, అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది, సౌదీలోని ఐదు రీఫ్యూయలింగ్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ చర్యలు సున్నీ–షియా విభేదాలను మరింత తీవ్రతరం చేస్తూ, గల్ఫ్ దేశాల సహనానికి హద్దును మించాయి. చమురు ధరలు పెరగడం ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.
ఈ మూకుమ్మడి దాడులు ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది, అమెరికా రక్షణ సహాయం అందిస్తోంది. సౌదీ విదేశాంగ మంత్రి ఇరాన్ వ్యూహ పునర్విచారణకు పిలుపునిచ్చారు. యూఏఈ యుద్ధంలోకి దిగితే భారతదేశం వంటి దేశాల్లో గల్ఫ్‌లో ఉన్న కోట్లాది కార్మికుల భద్రత ఆందోళన కలిగిస్తోంది.
