Sanchita Ugale: ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకున్న సంఘటన , యావత్తు సినీ ఇండస్ట్రీ ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ముంబై లోని ఆచోలే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఇంట్లో లేని సమయంలో , 22 ఏళ్ళ వయస్సు గల సంచిత ఫ్యాన్ కి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకొని , ఆత్మహత్య కు గల కారణాలను అన్వేషిస్తున్నారు. పిలుచుల విచారణ లో ప్రస్తుతానికి తేలింది ఏంటంటే సంచిత సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో ఆత్మహత్య చేసుకొని ఉండుంటుందని అంచనా వేస్తున్నారు. ఈమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు.
ఎందుకంటే ఘటన జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు లేవు. చనిపోయే ముందు సంచిత ఏదైనా ఉత్తరం రాసి ఉంటుందేమో అని పోలీసులు ఆమె రూమ్ మొత్తాన్ని గాలించారు. కానీ అలాంటిదేమి దొరకలేదు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్న పోలీసులు , కుటుంబ సభ్యుల నుండి కూడా కీలక సమాచారం తీసుకున్నారు. అంతే కాకుండా సంచిత సహా నటులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోస్ట్ మార్టం కి మృతదేహాన్ని పంపగా, నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని పోలీసులు ఈ సందర్భంగా మీడియా కి తెలిపారు.
ఇక సంచిత సినీ ప్రస్థానం విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా , అక్కడి ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఈ సీరియల్ ద్వారానే ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ , టీవీ షోస్ లతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె, గత ఏడాది విడుదలైన బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘చావా’ లో కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె తారాబాయి పాత్రలో కనిపించగా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. అవకాశాలు కూడా ఈమధ్య బాగానే వస్తున్నాయి, కానీ ఏమైందో ఏమో తెలియదు , ఇంత చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఆమెకి ఏమొచ్చిందో అని అభిమానులు బాధపడుతున్నారు. కచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ వల్లే సంచిత ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండుంటుందని అనుకుంటున్నారు నెటిజెన్స్
