Homeఎంటర్టైన్మెంట్Samantha: ఇప్పటికీ నాగ చైతన్య పాటలే వింటున్న సమంత.. సంచలనం రేపుతున్న వీడియో..

Samantha: ఇప్పటికీ నాగ చైతన్య పాటలే వింటున్న సమంత.. సంచలనం రేపుతున్న వీడియో..

Samantha: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత నే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా అనకాపల్లి నుండి అమెరికా వరకు అదిరిపోయాయి. మీడియం రేంజ్ క్రేజ్ యంగ్ హీరోలకు కూడా ఈ […]

Samantha: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత నే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా నటించిన ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా అనకాపల్లి నుండి అమెరికా వరకు అదిరిపోయాయి. మీడియం రేంజ్ క్రేజ్ యంగ్ హీరోలకు కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ సాధ్యమా అంటే అనుమానమే. ఇంతటి బలమైన ఓపెనింగ్స్ రావడానికి సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒక కారణం అయితే, సమంత చేసిన ప్రొమోషన్స్ కూడా ఒక కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా సమంత ఇంటర్వ్యూస్ కి సంబంధించిన క్లిప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.

ఈ రేంజ్ లో ఆమె సోషల్ మీడియా ఆడియన్స్ ని తన గ్రిప్ లోకి తీసేసుకుంది. అయితే ఒక ఇంటర్వ్యూ లో ఆమె నాగ చైతన్య సినిమా ప్రస్తావన తీసుకొని రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. యాంకర్ సమంత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ చాలానే ఉన్నాయి , వాటిల్లో మీరు ఇప్పటికీ వింటున్న మూవీ సాంగ్స్ ఏంటి?’ అని అడగ్గా , అందుకు సమంత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘ఏ మాయ చేసావే’ సినిమా పేరు చెప్పేసింది. తన కెరీర్ లో ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది అని , అలాంటి క్లాసిక్ కోసం ఎదురు చూస్తున్నానని , ఇప్పటికీ ఆ చిత్రం లోని పాటలు వింటూనే ఉన్నానని చెప్పుకొచ్చింది సమంత. దీనిపై సోషల్ మీడియా లో రకరకాలుగా తమకు తోచినట్టుగా కథనాలు రాసుకుంటున్నారు నెటిజెన్స్.

సమంత ఇప్పటికీ నాగ చైతన్య మీద ఇష్టం పోగొట్టుకోలేదని , అందుకే ‘ఏ మాయ చేసావే’ చిత్రం గురించి చెప్పుకొచ్చిందని అంటున్నారు. సమంత , నాగ చైతన్య ఇద్దరూ కూడా రెండవ పెళ్లి చేసుకొని , వాళ్ళ జీవితాలను సంతోషంగా లీడ్ చేస్తున్నారు, అలాంటిది ఇప్పటికీ వాళ్ళ మధ్య ఇలాంటి లింకులు పెట్టడం అన్యాయం, ‘ఏ మాయ చేసావే’ చిత్రం నిజంగా సమంత కి ఎంతో స్పెషల్ , ఆ చిత్రం ద్వారా నాగ చైతన్య తనకు పరిచయం అయ్యాడు అని కాదు, ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది కాబట్టి. అంతకు మించి మీరు ఊహించుకున్నట్టుగా ఏమి లేదని సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Chandra Kanth Kollu (@actor_chandu24)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper