Malayalam Actress: ఆమె అందం గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ఎత్తుకు ఎత్తు.. సౌందర్యానికి సౌందర్యం ఆమె సొంతం. పుట్టింది కేరళ రాష్ట్రంలో అయినప్పటికీ.. తెలుగులో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అవకాశాలు సొంతం చేసుకుంది. వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో బిజీ స్టార్ గా మారిపోయింది. ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ పడింది. చెప్పులో రాయిలా.. చెవిలో జోరీగలాగా.. ఆమెకు వరుసగా ఇబ్బందులు వచ్చాయి.
కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అవకాశాలు రావడం కాస్త తగ్గిపోయింది. ఫలితంగా ఆమె షాపింగ్ మాల్స్.. ఇతర ప్రైవేట్ కార్యక్రమాల ద్వారా ఆదాయం పెంచుకునే పని మొదలు పెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాలలో ఆమె గురించి ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటీషియన్ కు ఆమె దగ్గరయిందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆ నాయకుడికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఆమె ఉంటుందని ప్రచారం సాగుతోంది. చేతిలో ఉన్న ఆడపాదడపా అవకాశాలను ఆమె జాగ్రత్తగా వాడుకుంటున్నది. అందువల్లే ఎక్కడ సినిమా షూటింగ్ జరిగిన సరే వెళ్ళిపోతున్నది. ఎటువంటి కండిషన్లు పెట్టడం లేదు. అయితే ఈమె వెనుక పొలిటీషియన్ ఉన్నాడని తెలియడంతో.. సినిమా మేకర్లు కూడా ఈమె షూటింగ్ పార్ట్ ను డే టైం లోనే ఫినిష్ చేస్తున్నారు. అందువల్లే చీకటి పడే సమయానికి ఈ మలయాళ ముద్దుగుమ్మ ఆ పొలిటీషియన్ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతోంది ట్రావెలింగ్ ఖర్చులు మొత్తం ఆ పొలిటిషన్ భరిస్తున్నాడని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ మలయాళ ముద్దుగుమ్మ తన కెరీర్ మీద చాలా దృష్టి పెట్టింది. అనేక లక్ష్యాలతో ముందుకు వెళ్తోంది. పైగా ఆమెకు ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు. త్వరలోనే ఆమె పెళ్లికూడా చేసుకుంటుందని సమాచారం. అయితే కెరియర్ ఈ స్థాయిలో ఉన్నప్పుడే ఆమె మీద ఇలాంటి పుకార్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె కెరియర్ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కొంతకాలంగా ఒక పార్టీకి సంబంధించిన నాయకుడికి.. ఒక హీరోయిన్ కు మధ్య సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం ఇప్పుడు మరో పార్టీకి సంబంధించిన నాయకుడి మీదికి వెళ్లిపోయింది. అయితే ఇందులో బలిపశువైంది మాత్రం అప్పుడు ఆ నటి.. ఇప్పుడు ఈ మలయాళ ముద్దుగుమ్మ. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ పాలిటిక్స్ లో ఆ హీరోయిన్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలోకి ఈ కేరళ కుట్టి వచ్చింది. పొలిటీషియన్లకు ఇటువంటివి ఎలాంటి పేరు తెచ్చి పెడతాయో తెలియదు గానీ.. హీరోయిన్ల కెరియర్లను మాత్రం ఇటువంటి అంశాలు తీవ్రంగా బాధకు గురిచేస్తాయి.