Homeఎంటర్టైన్మెంట్Nithin: నితిన్ మూవీ నుండి తప్పుకున్న యంగ్ హీరోయిన్.. ఇంకెన్ని అవమానాలు తట్టుకోవాలి బాస్..

Nithin: నితిన్ మూవీ నుండి తప్పుకున్న యంగ్ హీరోయిన్.. ఇంకెన్ని అవమానాలు తట్టుకోవాలి బాస్..

Nithin: కాలం కలిసి రానప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టిలో చులకన అయిపోతాం, ముఖ్యంగా సినీ రంగం లో ఎప్పుడూ ఒకేలా ఉండదు , సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగా, సక్సెస్ లేనప్పుడు మరోలాగా ఉంటుంది. ముఖ్యంగా సక్సెస్ లేని సమయం , నీతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ దృష్టిలో కూడా లోకువ అయిపోతాము. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ పరిస్థితి అలాగే ఉంది. కెరీర్ ప్రారంభం లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ , మెగాస్టార్ […]

Nithin: కాలం కలిసి రానప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టిలో చులకన అయిపోతాం, ముఖ్యంగా సినీ రంగం లో ఎప్పుడూ ఒకేలా ఉండదు , సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగా, సక్సెస్ లేనప్పుడు మరోలాగా ఉంటుంది. ముఖ్యంగా సక్సెస్ లేని సమయం , నీతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ దృష్టిలో కూడా లోకువ అయిపోతాము. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ పరిస్థితి అలాగే ఉంది. కెరీర్ ప్రారంభం లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ , మెగాస్టార్ చిరంజీవి కి సైతం లేనటువంటి రికార్డ్స్ వచ్చాయి. అయితే సక్సెస్ ద్వారా వచ్చిన ఆ ఫేమ్ ని నితిన్ సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోవడం లో చూపించలేకపోయారు. ఆ కారణం చేత వరుసగా 14 డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. చేసిన సినిమాని రేలసే కూడా చెయ్యలేని రేంజ్ మార్కెట్ కి పడిపోయాడు.

అలాంటి స్థాయి నుండి నితిన్ కం బ్యాక్ ఇస్తాడని ఎవరైనా ఊహించారా?, కానీ ‘ఇష్క్’ చిత్రంతో దిమ్మతిరిగే రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాలుగైదు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి , కెరీర్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు అయ్యింది. ‘భీష్మ’ చిత్రం కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయ్యేసరికి , మరో రెండు హిట్స్ పడితే నితిన్ స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్ళిపోతాడేమో అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ఆ సినిమా తర్వాత ఈయన చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ముఖ్యంగా నితిన్ గత చిత్రం ‘తమ్ముడు’ కి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీంతో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు , నితిన్ తో తీయాల్సిన ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని దేవి శ్రీ ప్రసాద్ తో తీస్తున్నాడు.

నితిన్ సినిమాతో నిర్మాతగా వెండితెర అరంగేట్రం చేసి, అతని సినిమా టైటిల్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు కూడా ఇప్పుడు నితిన్ తో సినిమా తీసే సాహసం చేయడం లేదు. అంతే కాకుండా లేటెస్ట్ గా విక్రమ్ కె కుమార్ తో కూడా నితిన్ సినిమా క్యాన్సిల్ అయ్యింది. కారణం ఆయనకు మార్కెట్ పడిపోయిందని నిర్మాతలు వెనకడుగు వేయడం వల్లే. ఇలా వరుసగా రెండు అవమానాల తర్వాత, నితిన్ కి ఇప్పుడు మరో అవమానం ఎదురైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి నారి సరిసవాడ , సోమశేఖర్ అనే ఇద్దరు యువ దర్శకులు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా రితిక నాయక్ ని ఎంచుకున్నారు. కానీ మిరాయ్ తర్వాత ఆమె రెమ్యూనరేషన్ భారీ గా పెంచడంతో అంత ఇచ్చుకోలేక ఆమెని సినిమా నుండి తప్పించి , వైష్ణవి చైతన్య ని తీసుకున్నారు. ఇలా నితిన్ కి అవమానాల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper