Samantha: సమంత ముక్కుసూటి మనిషి. అలాగే మై లైఫ్ మై రూల్స్ అంటుంది. చైతూని వివాహం చేసుకున్నాక కూడా ఆమె అలానే జీవించారు. పబ్లిక్ వేడుకలకు సూపర్ హాట్ ట్రెండీ దుస్తుల్లో హాజరయ్యేవారు. ఆమె డ్రెస్సింగ్ అనేకమార్లు వివాదాస్పదమైంది. ఒకరి భార్యవు, గొప్పింటి కోడలివి, పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలేనా వేసుకునేదని చాలా మంది ట్రోల్ చేశారు. అవేమీ పట్టించుకోని సమంత, అదే పద్ధతిని పాటిస్తున్నారు. అలాగే సమంత పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. సూపర్ డీలక్స్ లో సమంత చేసిన ఓ సన్నివేశం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో కూడా ఆమె అసభ్యకర సన్నివేశాల్లో నటించారు.

ప్రస్తుతం సమంతకు ఎటువంటి బంధనాలు లేవు. ఆమె స్వేచ్ఛా జీవి. ఎటువంటి బట్టలేసుకున్నా, ఎలాంటి పాత్రలు చేసినా ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే సమంత సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో చాలా హాట్ గా ఉంది. చిన్నపాటి టాప్ ధరించిన సమంత, ఎదకు పర్స్ అడ్డుగా పెట్టుకుంది. సమంత లేటెస్ట్ బోల్డ్ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి ఆ హీరో ఫ్యాన్స్ అధ్యక్షుడు…. మహేష్ అభిమానులు సంబరాలు చేసుకునే న్యూస్
ప్రస్తుతం సమంత చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. సోలో హీరోయిన్ గా పాన్ ఇండియా చిత్రాలు చేస్తుంది. దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం మూవీ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇది పౌరాణిక గాథ కాగా… పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అలాగే మరో పాన్ ఇండియా చిత్రం యశోద. ఇటీవల మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల ఆదరణ దక్కింది. ఇటీవల విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ ప్రకటించారు.

నిన్ను కోరి, మజిలి చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి తెరకెక్కుతుంది. ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేశారు. ఖుషి టైటిల్ పై పవన్ అభిమానులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక తలపతి విజయ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సమంతను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు సార్లు విజయ్ తో జతకట్టిన సమంత… నాలుగో సారి చేయడానికి రెడీ అయ్యారట.
View this post on Instagram
Recommended Videos
[…] […]
[…] […]
[…] […]