Pop Star Mounass: ప్రపంచంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో వాటిపై ఆంక్షలు ఉన్నా మరికొన్ని దేశాల్లో వాటిని గురించి పట్టించుకోరు. దీంతో ఆడవాళ్లు ఎంతో నరకయాతన అనుభవస్తున్నారు. దీంతో నలిపేసిన రాక్షసులను వదిలి నలిగిపోయిన పువ్వులదే నేరంగా పరిగణించే సంప్రదాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సెనగల్ దేశంలోని పరిస్థితి చూస్తే జాలేస్తోంది. మహిళలపై అత్యాచారం జరిగితే వారిని నిందించడమే ప్రధానంగా పెట్టుకున్నారు. కానీ అత్యాచారం చేసిన వారిపై మాత్రం ఏ శిక్షలు విధించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మహిళా లోకం నినదించినా ఫలితం మాత్రం శూన్యమే.

దీంతో అక్కడ అత్యాచారానికి గురైతే ఆమెను మాత్రం ఇంటి నుంచి వెలేస్తారు. దీంతో ఆమె ఎక్కడో ఉంటూ బతుకు కొనసాగించాలి. తల్లిదండ్రులు, బంధువులు ఎవరు కూడా ఆమెపై జాలిచూపరు. ఆమె బతుకు భారమే అవుతుంది. ఎక్కడ ఉండాలి? ఎలా సంపాదించుకోవాలి? ఏం కావాలి? అనే ప్రశ్నలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న దమనకాండపై ఓ పాప్ సింగర్ తన ఆవేదనను ఓ పాట రూపంలో మలిచి అత్యాచారాలపై ఉద్యమిస్తోంది.
Also Read: Samantha: హాట్ హాట్ సమంత… అసలు తగ్గడం లేదుగా!
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె కూడా ఒకప్పుడు అత్యాచారానికి గురైన మహిళే కావడం విశేషం. ఆమెపై ఇద్దరు దుండగులు దాడి చేసి అత్యాచారం చేస్తే వారిపై చట్టపరంగా శిక్షలు మాత్రం విధింలేదు. దీంతో ఆమె అత్యాచారాల నిరోధానికి తన వంతుగా ఉద్యమిస్తోంది. ప్రసార మాధ్యమాల ద్వారా తన ఆవేదన వెలిబుచ్చుతోంది. దేశంలో విచ్చలవిడి నేరాలకు అడ్డు కట్ట వేయకుండా మహిళలనే బాధ్యులుగా చేయడంపై అభ్యంతరం చెబుతున్నారు.

అత్యాచార బాదితుల కోసం ఆమె గళం విప్పుతోంది. పాటల రూపంలో తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. అత్యాచారం జరిగిన వారిపైనే సమాజం చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. తన పాటల ద్వారా ప్రజలను జాగృతం చేస్తోంది. వారిని చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా దేశమంతా పర్యటిస్తోంది. విధివంచితుల పక్షాన పోరాటం చేస్తోంది. వారికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా తమ పోరాటం ఆపేది లేదని చెబుతోంది.
Also Read:Krishnapatnam Thermal Power Plant: కృష్ణపట్నం థర్మల్ కేంద్ర షట్ డౌన్ వెనుక కుట్ర ఇదా?
Recommended Videos