Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్. తన కామెడీ టైమింగ్ , ఎనర్జిటిక్ యాక్టింగ్ తో మొదటి రెండు మూడు సినిమాలతోనే ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో కొన్ని సంవత్సరాలు వరుసగా ఫ్లాపులు అందుకున్నాడు కానీ , కం బ్యాక్ మాత్రం చాలా గట్టిగానే ఇచ్చాడు. కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ చాలానే ఉన్నాయి. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ కి తన సినీ ప్రయాణం లో కొంతమంది హీరోయిన్స్ తో అత్యంత సన్నిహిత రిలేషన్స్ ఏర్పడ్డాయని, అవి ప్రేమ వరకు దారి తీసిందని సోషల్ మీడియా లో రూమర్స్ చాలా బలంగా వినిపించాయి. రెజినా తో డేటింగ్ చేసాడని కొన్ని రోజులు, అదే విధంగా రాశీ ఖన్నా తో డేటింగ్ చేసాడని మరికొన్ని రోజులు సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది.
ఈ ప్రచారం జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్ అలాంటిదేమి లేదని పలు ఇంటర్వ్యూస్ లో క్లారిటీ ఇచ్చాడు. కానీ సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రేమలో పడిన విషయం మాత్రం వాస్తవమేనట. అది ఎవరితో అనేది క్లారిటీ లేదు కానీ , ఈ రిలేషన్ కారణంగా మానసికంగా కూడా సాయి ధరమ్ తేజ్ చాలా కృంగిపోయాడట. పెళ్లి పైన ఆయనకు విరక్తి కలిగిందట. అందుకే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడట. అలాంటి సమయం లో తన చిన్ననాటి సెనేహితురాలు కిరణ్ సాయి ధరమ్ తేజ్ కి తోడుగా నిలిచిందని , ఆ సమయం లోనే వీళ్లిద్దరి మనసులు దగ్గరయ్యాయని , ఒకరిని ఒకరు ఇష్టపడడంతో కొన్ని రోజులు డేటింగ్ చేసి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చారని అంటున్నారు. రీసెంట్ గానే వీళ్లిద్దరి నిశ్చితార్థం ఎంతటి వైభోగంగా జరిగిందో మనమంతా చూసాము.
వచ్చే నెలలో వీళ్లిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. మరి పెళ్లి తర్వాత ఆయన జీవితం ఎలా ఉంటుందో చూడాలి. లావణ్య త్రిపాఠీ , వరుణ్ తేజ్ జంట లాగానే , సాయి ధరమ్ తేజ్ కూడా ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని అభిమానులు భావించారు. అసలు పెళ్లి చేసుకోడేమో అనే సందేహాలు కూడా ఉండేవి. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. చాలా మంది యంగ్ హీరోలకు పెళ్లి తర్వాత సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. హిట్ల మీద హిట్లు అందుకుంటున్నారు. నాగ చైతన్య , అక్కినేని అఖిల్ , కిరణ్ అబ్బవరం ఇలా ఎంతో మంది యంగ్ హీరోలు పెళ్లి తర్వాత తారా స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కి కూడా అలాగే కలిసొస్తుందని అంచనాలోనే ఉన్నారు ఫ్యాన్స్. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.