Homeఎంటర్టైన్మెంట్Ramayana Movie: 1650 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. 4 రోజుల్లో 'రామాయణ' రాబట్టింది ఎంతంటే!

Ramayana Movie: 1650 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. 4 రోజుల్లో ‘రామాయణ’ రాబట్టింది ఎంతంటే!

Ramayana Movie: నితీష్ తివారి తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. 4 రోజుల్లో దాదాపుగా వరల్డ్ వైడ్ గా 519 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. 4 వ రోజున ఈ చిత్రానికి ఏకంగా 128 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 32 కోట్ల […]

Ramayana Movie: నితీష్ తివారి తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. 4 రోజుల్లో దాదాపుగా వరల్డ్ వైడ్ గా 519 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. 4 వ రోజున ఈ చిత్రానికి ఏకంగా 128 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ 4 రోజుల్లో వచ్చాయట. కానీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇది సరిపోదట. ఎందుకంటే టార్గెట్ 1650 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 1500 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ లాంగ్ రన్ ఉంటే మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.

ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల నుండి 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 185 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, కర్ణాటక నుండి 52 కోట్ల 15 లక్షల రూపాయిలు , తమిళనాడు నుండి 14 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, కేరళ నుండి 13 కోట్ల 10 లక్షల రూపాయిలు , ఓవర్సీస్ నుండి ఏకంగా 217 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా 519 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఇక నార్త్ ఇండియా నేడు అయితే ఈ సినిమాకు సునామీ ని తలపించే రేంజ్ లో వసూళ్లు నమోదు అవుతున్నాయి. నిన్న మొన్నటి కంటే నేడు ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. ఈ వీకెండ్ లోపే ఈ చిత్రం 1000 కోట్ల గ్రాస్ ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper