Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్' హిస్టరీ లోనే నిజమైన లవ్ స్టోరీ.. కంటతడి...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ హిస్టరీ లోనే నిజమైన లవ్ స్టోరీ.. కంటతడి పెట్టించిన రోహిత్ , షాలిని!

Bigg Boss 10 Telugu: ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోనూ లవ్ ట్రాక్స్ కేవలం కంటెంట్ కోసమే పెట్టుకునేవారు. హౌస్ లో నువ్వు లేకపోతే నేను లేను అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తారు , కానీ బయటకు వెళ్లిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటారు. అలాంటి జంటలను ఇప్పటి వరకు ఎన్నో చూసాము. ఇలాంటివి చూసి జనాలు బాగా విసిగిపోవడం వల్లే , ప్రస్తుతం నడుస్తున్న […]

Bigg Boss 10 Telugu: ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోనూ లవ్ ట్రాక్స్ కేవలం కంటెంట్ కోసమే పెట్టుకునేవారు. హౌస్ లో నువ్వు లేకపోతే నేను లేను అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తారు , కానీ బయటకు వెళ్లిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటారు. అలాంటి జంటలను ఇప్పటి వరకు ఎన్నో చూసాము. ఇలాంటివి చూసి జనాలు బాగా విసిగిపోవడం వల్లే , ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్ బాస్ 10’ లో షాలిని , రోహిత్ లవ్ ట్రాక్ ని చూసి ఆడియన్స్ బాగా క్రింజ్ ఫీల్ అయ్యారు. విన్నర్ రేస్ లో ఉన్న రోహిత్ కి ఈ లవ్ ట్రాకులు అవసరమా?, గేమ్ గాడి తప్పుతోంది, ఇలా అయితే కష్టమే అని అనుకున్నారు అభిమానులు. వీళ్ళు కూడా కేవలం కంటెంట్ కోసమే ఇదంతా చేస్తున్నారు , నిజమైన లవ్ కాదని అంతా అనుకున్నారు.

కానీ నిన్నటి ఎపిసోడ్ తో వీళ్ళిద్దరిది నిజమైన లవ్ అని స్పష్టమైంది. షాలిని ఎలిమినేట్ అవ్వగానే రోహిత్ ఆమెని హత్తుకొని చిన్న పిల్లవాడిలాగా ఏడవడం అందరినీ చాలా బాధకు గురి చేసింది. అంతే కాదు వెళ్లే ముందు షాలిని రోహిత్ కి ప్రపోజ్ చేయడం , బయటకు వచ్చిన తర్వాత చూసుకుందాం అని అన్నట్టుగా మాట్లాడడం వంటివి చూసినప్పుడు కచ్చితంగా వీళ్లిద్దరు ప్రేమలోనే ఉన్నారు , అది ఫేక్ కాదు నిజమే అనే భావన అందరిలోనూ కలిగింది. ఇక సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత కూడా షాలిని టీవీ లో రోహిత్ ని చూస్తూ బాగా మురిసిపోతోంది. అవన్నీ నిజమైన ఫీలింగ్స్ లాగానే అనిపించాయి. మొన్నటి వరకు వీళ్లిద్దరు కంటెంట్ కోసమే ఇదంతా చేస్తున్నారని సోషల్ మీడియా లో అనుకునేవారు, కానీ నిన్నటి ఎపిసోడ్ తో ఆ అభిప్రాయం నెటిజెన్స్ లో పూర్తిగా మారిపోయింది.

సీక్రెట్ రూమ్ నుండి షాలిని బయటకు వచ్చిన తర్వాత రోహిత్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మాత్రం దానికి షాలిని ని సీక్రెట్ రూమ్ లో పెట్టడం ఎందుకు?, ఏమి ఉపయోగం అని అంతా అనుకుంటున్నారు. సీక్రెట్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, తమని ఎంతగానో ఇష్టపడే కంటెస్టెంట్స్ , తాము ఎలిమినేట్ అయ్యాక తమ గురించి ఏమి మాట్లాడుకుంటున్నారు?, తమతో నిజమైన రిలేషన్ ని మైంటైన్ చేస్తున్నారా లేదా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసమే ఈ సీక్రెట్ రూమ్ ఉపయోగపడుతుంది. కానీ రోహిత్ , షాలిని లది నిజమైన బంధం అని తేలిపోయింది , షాలిని సీక్రెట్ రూమ్ కి వెళ్లిన తర్వాత కూడా రోహిత్ ఆమెని తలచుకొని బాధపడుతూ ఉన్నాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ షాలిని గురించి ఏమైనా నెగెటివ్ గా మాట్లాడుకుంటున్నారా అంటే అది కూడా జరగలేదు.

ఒకవేళ మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆమెకు ఎవరితో పెద్దగా రిలేషన్స్ లేవు , అందరితోనూ గొడవలే ఉన్నాయి కాబట్టి పెద్ద కిక్ ఏమి ఉండదు. అలాంటప్పుడు షాలిని ని ఎందుకు సీక్రెట్ రూమ్ లో పెట్టారు అంటే , ఆమె నుండి భీభత్సమైన కంటెంట్ వస్తుంది కాబట్టే. అంతే కాకుండా రోహిత్ కి ఉన్న ఏకైక బలహీనత షాలిని ఒక్కటే , ఈ కారణం చేత ఆయన గేమ్ డౌన్ అవ్వొచ్చు అనే ఉద్దేశ్యంతో కూడా బిగ్ బాస్ టీం షాలిని ని సేవ్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపి ఉండొచ్చని అంటున్నారు. నేడు రేపు నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది, ఈ రెండు రోజులు పూర్తి అయ్యాక షాలిని బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. ఆమె హౌస్ లోకి వెళ్లే ముందు ఒక పవర్ తో వచ్చే అవకాశం ఉంది. ఈమె రోహిత్ , అమన్ లతో కలిసి నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నందుకు నాగార్జున ఈ వారం ఈ ముగ్గురిని కెప్టెన్సీ రేసు నుండి తప్పించారు. రీ ఎంట్రీ ఇచ్చే ముందు షాలిని ని కెప్టెన్సీ కంటెండర్ ని చేయడమే కాకుండా, తన చేతుల ద్వారా మరొకరిని కంటెండర్ ని చేసే అవకాశం కూడా బిగ్ బాస్ టీం ఇవ్వొచ్చు. అదే కనుక జరిగితే ఆమె రోహిత్ ని కంటెండర్ చేస్తుందని చెప్పొచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper