Homeఎంటర్టైన్మెంట్Akhanda Movie: 'అఖండ' అఖండమైన విజయానికి అదే కారణం !

Akhanda Movie: ‘అఖండ’ అఖండమైన విజయానికి అదే కారణం !

Akhanda Movie: తెలుగు బాక్సాఫీస్ నిండా ఇప్పుడు ‘జై బాలయ్య’ నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి బాలయ్య బాబు సినిమాలు అంటే..ఈ మధ్య క్రేజ్ కాస్త తగ్గింది గాని, ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య సినిమాలు అంటే.. అదొక జాతర. ఆ జాతర మళ్లీ అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా కనిపించింది. ఇప్పుడు హార్డ్ కొర్ ఫ్యాన్స్ అంతా అఖండ టైటిల్ తో పాటు జై బాలయ్య అంటూ పచ్చబొట్లును వేయించుకుంటున్నారు.

Akhanda Movie
Akhanda Movie

ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఏ హీరోకి లేవు. మొత్తానికి బాలయ్యకి సాలిడ్ హిట్ వచ్చింది. బాలయ్య అఖండ సినిమాకు మొదటి నుండి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను అందుకోవడంలో బోయపాటి తడబడ్డాడేమో గానీ, బాలయ్య మాత్రం అదరగొట్టాడు. ఎప్పటిలాగే బోయపాటి సినిమా లాగే ఈ సినిమా కూడా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగింది.

కానీ, ఆ పవర్ ఫుల్ యాక్షన్ లో ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్ లో డెప్త్ ఉంది. అన్నిటికీ మించి బాలయ్య నట విశ్వరూపం ఉంది. పైగా బోయపాటి – బాలయ్య కలయికలో సినిమా అంటేనే.. అదొక బీభత్సమైన యాక్షన్ డ్రామా. అది దృష్టిలో పెట్టుకునే… ముఖ్యంగా తమ కాంబినేషన్ కు ఉన్న మార్క్ చెడిపోకుండా బోయపాటి సినిమాను మలిచిన విధానం బాగుంది.

Also Read: Akhanda Telugu Movie Review : ‘అఖండ’ మూవీ రివ్యూ

అయితే, కేవలం యాక్షన్ కారణంగానే అఖండ సినిమా హిట్ అయింది అనలేం. అఘోర అంటూ ఓ కొత్త మార్క్ ను అందుకోవటానికి ప్రయత్నిస్తూ.. బోయపాటి ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపించాడు. అందుకే, సినిమాలో బాలయ్య తన రొటీన్ డైలాగ్స్ అండ్ యాక్షన్ తో విచ్చలవిడిగా ఫైట్లు చేసినా మధ్యమధ్యలో అఘోరాగా చెప్పిన మాటలు చాలా బాగున్నాయి.

ఏది అయితే ఏం.. అఖండ సినిమా బాలయ్య అభిమానులను ఫుల్ గా అలరిస్తోంది. బలమైన ఎమోషన్ తో వెరీ ఎమోషనల్ గానూ అదేవిధంగా చాలా వైవిధ్యంగానూ ఉంది. అందుకే అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇవన్నీ దృష్టలో పెట్టుకుంటే అఖండ సినిమా హిట్ అవడానికి కారణం.. బీభత్సమైన యాక్షనూ అద్భుతమైన ఎమోషనే మెయిన్ కారణం.

Also Read: Akhanda: థియేటర్​లో బాలయ్య ఫ్యాన్స్​కు షాక్​.. ‘అఖండ’ సినిమా ఆపేసి పోలీసులు వార్నింగ్​

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper