Homeఎంటర్టైన్మెంట్అరె.. 'రష్మిక మండన్నా' తప్పు చేస్తోందట !

అరె.. ‘రష్మిక మండన్నా’ తప్పు చేస్తోందట !

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ గా కొనసాగుతున్నా.. ఎప్పటికైనా హిందీ సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఒక వెలుగు వెలిగిపోవాలని ప్రతి హీరోయిన్ తెగ ఉబలాట పడుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో సౌత్ హీరోయిన్లెవరూ హిందీ సినిమాల్లో క్లిక్ కావడం లేదు అని లెక్కలు పక్కాగా ఉన్నా, రష్మిక మండన్నా మాత్రం అవకాశాలు రాగానే ఆలోచించకుండానే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మరో హీరోయిన్ పూజ హెగ్డేకి సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్ […]

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ గా కొనసాగుతున్నా.. ఎప్పటికైనా హిందీ సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఒక వెలుగు వెలిగిపోవాలని ప్రతి హీరోయిన్ తెగ ఉబలాట పడుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో సౌత్ హీరోయిన్లెవరూ హిందీ సినిమాల్లో క్లిక్ కావడం లేదు అని లెక్కలు పక్కాగా ఉన్నా, రష్మిక మండన్నా మాత్రం అవకాశాలు రాగానే ఆలోచించకుండానే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

మరో హీరోయిన్ పూజ హెగ్డేకి సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ మాటకొస్తే ప్రస్తుతం సౌత్ నెంబర్ వన్ హీరోయిన్ కుడా పూజానే. పైగా పూజా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందే బాలీవుడ్ లో. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో సరసన నటించింది. అయినా బాలీవుడ్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక ఇంకా చిన్నాచితక హీరోయిన్ గానే మిగిలిపోయింది పూజా.

మరీ రష్మిక బాలీవుడ్ లో ఎంతవరకు నెట్టుకొస్తోందో. పైగా రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి ఫ్లాప్ హీరోతో నటిస్తోంది. ఆమె మొదటి బాలీవుడ్ సినిమా కూడా సిద్ధార్థ్ మల్హోత్రాదే. ఒక ప్లాప్ హీరోతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం ఏముంటుంది ? సినిమాకి ఎలాగూ ఓపెనింగ్స్ రావు కదా. ఆ ఎఫెక్ట్ రష్మిక మీదే పడే ఛాన్స్ ఉంది. అదే తెలుగు చిత్ర సీమలో అయితే రష్మికకి మంచి క్రేజ్ ఉంది, ప్రస్తుతం బన్నీ సరసన నటిస్తోంది.

ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో కూడా రష్మిక నటించే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి, తెలుగులోనే ఆమె ఫుల్ ఫోకస్ పెడితే.. టాలీవుడ్ లో నంబర్‌ వన్ హీరోయిన్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉందని అంటున్నారు. కానీ రష్మిక మాత్రం బాలీవుడ్ ఆశలతో టాలీవుడ్ పై ఈ మధ్య ఫోకస్ తగ్గించిందని, రష్మిక తప్పు చేస్తోందని ఆమె సన్నిహితులు ఫీల్ అవుతున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper