
నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మెదక్, నల్గొండ, జిల్లాల నుంచి రెంటచింతల వరకు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు ఈరోజు తమిళనాడు, కర్ణాటక అంతటా, మహారాష్ట్రలో మరికొంతభాగం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరికొంత భాగం, ఈశాన్య భారతదేశ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని సంచాలకులు వివరించారు.