
ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని నర్సింగ్ స్టాఫ్ కు ఢిల్లీ జిప్మార్ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిప్ మర్ వివాదాస్పద సర్క్యలర్ ను వెనక్కి తీసుకున్నది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి ఆదేశాలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. జిప్ మర్ ఆదేశాలు భాష ఆధిపత్యాన్ని పురావృతం చేస్తున్నాయి. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉండాలి. అని కేటీఆర్ పేర్కొన్నారు.