Bigg Boss 10 Telugu: ఒక మనిషిని తొక్కడం ఎలా అనేది కళ్లారా చూడాలంటే , ‘బిగ్ బాస్ 10’ ని చూడొచ్చు అంటూ సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజుల నుండి నెటిజెన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు లక్షల రూపాయిల సంపాదన వదులుకొని , కేవలం తన తల్లి కోసం ‘బిగ్ బాస్ 10’ షోలో పాల్గొనాలని అనుకున్నాడు రోహిత్ నాయుడు. ‘అగ్ని పరీక్ష 2’ లో ఈయన టాలెంట్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. చూసేందుకు చాలా కూల్ గా కనిపిస్తున్నాడు , ఇతనిలో ఇంత మ్యాటర్ ఉందా అని అంతా అనుకున్నారు. అలా ఆ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రోహిత్, భారీ హైప్ తో ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టాడు.
అలా భారీ హైప్ తో అడుగుపెట్టిన రోజు నుండి , నేటి వరకు ఈ షోలో తిరుగులేని పబ్లిక్ ఓటింగ్ తో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. వార్ వన్ సైడ్ అయిపోయింది , అతనికి దరిదాపుల్లో మరొక కంటెస్టెంట్ లేరు అనే రేంజ్ లో తన డామినేషన్ ని చూపించాడు. అయితే విన్నర్ ఎవరో 6 వారాల్లోనే తేలిపోయింది, ఇలా అయితే షో లో మజా ఉండదు , కాస్త ఆసక్తికరంగా మార్చాలి అనే ఉద్దేశ్యంతో , గత వారం మొత్తం రోహిత్ ని టాస్కులు ఆడనివ్వకుండా సైలెంట్ గా హౌస్ లో ఒక మూలాన కూర్చోబెట్టారు. అదే సమయం లో టాప్ 2 లో కొనసాగుతున్న త్రిగున్ కి వరుసగా మూడు టాస్కుల్లో పాల్గొనే అరుదైన అవకాశం కల్పించారు మేకర్స్. ఒక టాస్క్ లో త్రిగున్ బాగా షైన్ అవ్వడం తో అతని గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గత వారం చివరి రెండు రోజులు ఆయనకు రోహిత్ ని మించిన ఓటింగ్ పడింది.
కానీ ఇద్దరి మధ్య ఓట్ల గ్యాప్ పెద్దగా లేదు. రోహిత్ కి భవిష్యత్తులో ఒక్క సరైన టాస్క్ పడినా ఇక అతన్ని అందుకోలేరనే ఉద్దేశ్యం తో, బిగ్ బాస్ టీం అతనికి బ్లాక్ కార్డు ఇచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఎవరికీ ఈ కార్డు ఇవ్వలేదు. రోహిత్ కోసం ప్రత్యేకంగా కనిపెట్టి తీసుకొచ్చారు. ఈ కార్డు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, రెండు వారాల పాటు అతను బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వలేడు. అంటే కెప్టెన్సీ కి సంబంధించిన టాస్కులు ఆడడేందుకు వీలు లేదన్నమాట. వాస్తవానికి సీజన్ మొత్తం లేదని హోస్ట్ నాగార్జున అన్నాడు, కానీ రోహిత్ మోకాళ్ళ మీద నిల్చొని నాగార్జున ని ప్రాధేయపడడంతో పాటు, హౌస్ మేట్స్ కూడా అందుకు అంగీకరించకపోవడం తో రెండు వారాలకు మార్చారు.
అయితే రోహిత్ కంటే ఎక్కువ తప్పులు చేసిన త్రిగున్ కి మాత్రం కేవలం అరపూట జైలు శిక్ష మాత్రమే విధించాడు నాగార్జున. ఇంతటి అన్యాయం బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ చూడలేదని, రాబోయే రోజుల్లో రోహిత్ ని తొక్కేందుకు ఇంకెన్ని కొత్త కార్డులు కనిపెడుతారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద ఇంత టార్గెటింగ్ ఏ సీజన్ లో కూడా జరగలేదని అంటున్నారు విశ్లేషకులు. తోటి కంటెస్టెంట్స్ టార్గెట్ తో పాటు , బిగ్ బాస్ టీం , హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా రోహిత్ ని టార్గెట్ చేసి , మానసికంగా అతన్ని తోక్కేస్తున్నారు. నరకం అనుభవించేలా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.