Homeఎంటర్టైన్మెంట్Ranabaali Trailer: 'రణబాలి' ట్రైలర్ వచ్చేసింది.. 'సై రా నరసింహా రెడ్డి' పోలికలు ఉన్నాయ్!

Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్ వచ్చేసింది.. ‘సై రా నరసింహా రెడ్డి’ పోలికలు ఉన్నాయ్!

Ranabaali Trailer: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ కం బ్యాక్ కోసం ఆయన అభిమానులే కాదు , మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఫ్లాపుల్లో ఉన్న హీరోలందరూ కం బ్యాక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ కం బ్యాక్ కూడా ఈ సంవత్సరం లోనే ఉంటుందని , ‘రణబాలి’ చిత్రం కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతుందని అభిమానులు ఆశించారు. ఇప్పటి వరకు విడుదల […]

Ranabaali Trailer: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ కం బ్యాక్ కోసం ఆయన అభిమానులే కాదు , మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఫ్లాపుల్లో ఉన్న హీరోలందరూ కం బ్యాక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ కం బ్యాక్ కూడా ఈ సంవత్సరం లోనే ఉంటుందని , ‘రణబాలి’ చిత్రం కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతుందని అభిమానులు ఆశించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. సుమారుగా 4 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ ట్రైలర్ కి సంబంధించిన రివ్యూ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం.

ట్రైలర్ చూస్తుంటే మంచి ఇంటెన్స్ స్టోరీ లాగానే అనిపిస్తోంది. మన భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు , సింగనమల బొబ్బిలి రణబాలి అనే యోధుడుకి సంబంధించిన వీరోచిత పోరాటాన్ని ఈ చిత్రం లో చూపించే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. ట్రైలర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆడియన్స్ రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ సన్నివేశాలు చాలానే పెట్టినట్టు ఉన్నారు. కొద్దిగా మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ ఛాయలు కూడా కనిపించాయి. రెండు సినిమాలు ఒకే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం తో పాటు, కొన్ని షాట్స్ నేరుగా సైరా మూవీ నుండే లేపేసినట్టుగా అనిపించాయని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇక ట్రైలర్ లో విజయ్ దేవరకొండ కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది. ఇప్పటి వరకు కేవలం యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ని ఒక్కసారిగా ఇంతటి వయొలెంట్ రోల్ లో చూడడం కాస్త థ్రిల్లింగ్ గానే అనిపించింది.

కానీ రాయలసీమ కి చెందిన వీరుడు అంటే , చాలా నేచురల్ గా ఇంటెన్స్ లుక్స్ తో కనిపించాలి. విజయ్ దేవరకొండ రాయలసీమ యాస ని పర్ఫెక్ట్ గా ఉచ్చరించే ప్రయత్నం చేసాడు కానీ , ఎక్కడో న్యాచురాలిటీ మిస్ అవుతోంది. అంతే కాకుండా విజయ్ దేవరకొండ ఎక్స్ ప్రెషన్స్ విరోచితంగానే ఉన్నాయి , కానీ సోషల్ మీడియా లో వాటిపై విపరీతమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ ని చూస్తుంటే సినిమాలో మంచి విషయం ఉన్నట్టుగానే అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఎలా నటించాడు అనే దానిపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper