Bigg Boss 10 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ‘రోడ్ టు రీలోడ్’ టాస్కులు ఎంత ఉత్కంఠ మధ్య నడుస్తున్నాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో అపూర్వ , చరణ్ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించి టాప్ 1 స్థానం లో నిలిచారు. కానీ నేడు మాత్రం చివరి స్థానం లో నిలిచారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే , స్ట్రాంగ్ ప్లేయర్ గా పిలవబడే రోహిత్ నిన్నటి టాస్క్ లో చివరి స్థానం లో నిలిచాడు , నేడు అయితే మొదటి టాస్క్ చాలా కష్టమైనది అయ్యినప్పటికీ , షాలిని ని బరిలో దించి , తాను సైలెంట్ గా కూర్చున్నాడు. దీంతో షాలిని నాల్గవ స్థానం లో టాస్క్ ఫినిష్ చేసింది. ఇక ముకేశ్ , ఝాన్సీ లు మూడవ స్థానం లో నిలబడగా , రెండవ స్థానం లో రామ్ ప్రసాద్, నరేష్ నిలిచారు.
ఇక మొదటి స్థానం లో అమన్ -త్రిగున్ నిలిచారు. వీళ్లిద్దరికీ లీడర్ బోర్డు మొదటి స్థానం దక్కింది. వీళ్లిద్దరికీ దరిదాపుల్లో కూడా మరో కంటెస్టెంట్ లేకపోవడం గమనార్హం. లీడర్ బోర్డు విషయానికి వస్తే నేటి రెండవ టాస్క్ ముగిసి సమయానికి త్రిగుణ -అమన్ 180 పాయింట్స్ తో మొదటి స్థానం లో నిలబడగా , రెండవ స్థానం లో అపూర్వ -చరణ్ , ముకేశ్ -ఝాన్సీ , రామ్ ప్రసాద్ -నరేష్ లు చెరో 120 పాయింట్స్ తో ఉన్నారు. ఇక కేవలం 60 పాయింట్స్ తో అందరి కంటే చివరి స్థానం లో రోహిత్ -షాలిని నిలిచారు. వీళ్ళ జట్టుకి ఇంత తక్కువ మార్కులు రావడానికి ప్రధాన కారణం రోహిత్ , అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొదటి టాస్క్ లో షాలిని రోప్ పట్టుకొని చాలా బలంగా ఆడింది కానీ , రోహిత్ మాత్రం ఫజిల్ ని పూర్తి చెయ్యలేకపోయాడు.
రోహిత్ లాంటి మైండ్ గేమర్ అసలు ఫజిల్ పూర్తి చేయలేకపోవడం అనేది పెద్ద అవమానం గా భావించవచ్చు. రెండవ టాస్క్ చాలా కష్టమైనది అని తెలుసు, షాలిని పొడవుగా ఉండదు కాబట్టి , ఈ టాస్క్ కి ఆమె పనికిరాదు అనే విషయం కూడా తెలుసు, అయినప్పటికీ తాను వెళ్లకుండా, షాలిని ని ఈ టాస్క్ కి పంపిస్తాడు రోహిత్. ఒకవేళ రోహిత్ వెళ్లి ఉండుంటే ఇంత తక్కువ పాయింట్స్ వచ్చేవి కాదు , కనీసం 60 పాయింట్స్ అయినా వచ్చేవి. ఈ రెండు టాస్కుల్లో రోహిత్ తన అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. అసలు ఏమైంది రోహిత్ కి , ఎందుకు ఇంత చెత్తగా ఆడుతున్నాడు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు.