Homeఎంటర్టైన్మెంట్Ranabaali movie budget: 'రణబాలి' మూవీ బడ్జెట్ పెరుగుతుందా..? ఇంతకీ విజయ్ మార్కెట్ ఎంత..?

Ranabaali movie budget: ‘రణబాలి’ మూవీ బడ్జెట్ పెరుగుతుందా..? ఇంతకీ విజయ్ మార్కెట్ ఎంత..?

Ranabaali movie budget: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ డైరెక్టర్ సైతం ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో కాన్సెప్ట్ లను రాసుకొని సినిమాలను చేస్తూ విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకి బ్రేకులు వేస్తూ మన వాళ్ళు చేసే సినిమాలు యావత్ ఇండియన్ సినిమా స్థాయిని సైతం శాసించే విధంగా ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక విజయ్ దేవరకొండ సైతం కెరియర్ మొదట్లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి వరుస సక్సెస్ లను సాధించాడు.

ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దాంతో ఎలాగైనా సరే రాబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకొని టాప్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే రణబాలి, రౌడీ జనార్ధన్ లాంటి సినిమాతో మరోసారి భారీ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు బాగానే ఉంది. కానీ ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. విజయ్ దేవరకొండ ను టైర్ వన్ హీరోగా మారుస్తుందా? లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుందట.

నిజానికి విజయ్ దేవరకొండ సినీ సక్సెస్ అయితే 100 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తాయి. మరి అలాంటిది ఈ సినిమా మీద దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ నైతే కేటాయిస్తున్నారు. ఒకవేళ ప్లాప్ టాక్ తెచ్చుకుంటే మాత్రం భారీగా నష్టాలను చవిచూసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందాన కలిసి నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular