Homeఎంటర్టైన్మెంట్Rana Daggubati : రానా దగ్గుబాటితో డైరెక్టర్ అట్లీ చర్చలు.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుంది!

Rana Daggubati : రానా దగ్గుబాటితో డైరెక్టర్ అట్లీ చర్చలు.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుంది!

rana daggubati : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun), అట్లీ(Atlee) మూవీ కి సంబందించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఈమధ్య కాలం లోనే ఈ సినిమా ఔట్పుట్ పై అల్లు అర్జున్ సంతృప్తి తో లేడని, అనేక సన్నివేశాలు రీ షూట్ చెయ్యాలంటూ డైరెక్టర్ అట్లీ కి అల్లు అర్జున్ ఆదేశించాడని, అందుకు అట్లీ నిరాశకు గురయ్యాడని, […]

rana daggubati : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun), అట్లీ(Atlee) మూవీ కి సంబందించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఈమధ్య కాలం లోనే ఈ సినిమా ఔట్పుట్ పై అల్లు అర్జున్ సంతృప్తి తో లేడని, అనేక సన్నివేశాలు రీ షూట్ చెయ్యాలంటూ డైరెక్టర్ అట్లీ కి అల్లు అర్జున్ ఆదేశించాడని, అందుకు అట్లీ నిరాశకు గురయ్యాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. వీటిల్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్దం ఉంది అనేది తెలియదు కానీ , ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మాత్రం గ్యాప్ లేకుండా ముంబై లో జరుగుతూనే ఉంది. త్వరలో తన సోదరుడు అల్లు శిరీష్ వివేహ వేడుక ఉంది, అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. కానీ షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల అల్లు అర్జున్ ఈ పనుల్లో భాగం కాలేకపోయాడు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ లో రీసెంట్ గానే జాన్వీ కపూర్(Jhanvi Kapoor) ఎంట్రీ ఇచ్చింది. ఆమె పై గత రెండు రోజుల నుండి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో రానా దగ్గుబాటి(Rana Daggubati) కూడా నటించబోతున్నాడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్ గానే ముంబై కి వచ్చిన రానా ని, అల్లు అర్జున్ వ్యక్తిగతం గా కలిసి ఒక 45 నిమిషాల పాటు మాట్లాడాడు అట. మరుసటి రోజున డైరెక్టర్ అట్లీ కూడా రానా ని వ్యక్తిగతంగా కలిసి చాలా సేపటి వరకు చర్చించాడట. ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ రానా ని కలిసి మన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దానికి నువ్వు మాత్రమే న్యాయం చేయగలవు, రేపు డైరెక్టర్ అట్లీ వచ్చి నీకు స్టోరీ వినిపిస్తాడు, విని నీ అభిప్రాయం చెప్పు అని రానా కి చెప్పినట్టు, మరుసటి రోజు అట్లీ రానా ని కలిసి స్టోరీ ని వినిపించినట్టు తెలుస్తోంది.

అయితే రానా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈమధ్య కాలం లో రానా చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. హీరో గా సినిమాలు చేయడం ఆపేసి చాలా రోజులైంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత రానా రేంజ్ మారిపోతుందని అంతా అనుకున్నారు. ఆ సినిమా తర్వాత విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ కమర్షియల్ గా పెద్ద హిట్ కూడా అయ్యింది. కానీ ఎందుకో రానా హీరో గా కెరీర్ ని మాత్రం కొనసాగించలేకపోయాడు. సినిమాల మీద కంటే కూడా ఆయన ఎక్కువగా వ్యాపారాల మీదనే ద్రుష్టి పెట్టాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper