Ram Charan : మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మగధీర (Magadheera) సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్న రామ్ చరణ్ రంగస్థలం (Rangasthalam) సినిమాతో తనను తాను స్టార్ హీరోగా మలుచుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే హీరోగా మారిపోయాడు. త్రిబుల్ ఆర్ (RRR) సినిమా విషయానికి వస్తే ఈ సినిమాతో నటుడిగా మరొక మెట్టు పైకి ఎదిగిన ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా మారిపోయాడు… ఇక రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు డీలా పడినప్పటికి ఇప్పుడు బుచ్చిబాబు (Buchhi babu) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ (Ram Charan) తనలోని పరిపూర్ణ నటుడుని బయటికి తీయడమే కాకుండా ఈ సినిమా కాన్సెప్ట్ తో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని కూడా సాధించబోతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో భారీ తారాగణం అయితే ఉందనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడనే విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా ఆయన సినిమా షూట్ లో కూడా పాల్గొంటున్నాడు. అయితే రామ్ చరణ్ కి అన్నయ్య క్యారెక్టర్ లో ఆయన నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందట. అందుకోసమే ప్రత్యేకించి మరీ ఆ పాత్రలో ఆయన తీసుకున్నట్టుగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో శివ రాజ్ కుమార్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ఆయన క్రేజ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు యూజ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే బుచ్చిబాబు (Buchhi Babu) ఆయన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఆయన నట విశ్వరూపాన్ని చూపించాలని చూస్తున్నారట. రామ్ చరణ్ శివ రాజ్ కుమార్ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయట.
ఈ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మన తెలుగు హీరోల హవా ఎక్కువగా నడుస్తోంది. కాబట్టి ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read : రామ్ చరణ్ తో సక్సెస్ అందుకున్న కూడా ఆ దర్శకుడిని ఎవ్వరూ పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి..?