Ram Charan : సినిమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీ గా గడిపే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) పార్లమెంట్ లోకి అడుగుపెట్టబోతున్నాడా?, అంత అవసరం ఆయనకీ ఏమొచ్చింది?, ప్రధాన మంత్రిని కలవబోతున్నాడా?, లేదా వేరే ఏదైనా రాజకీయ వ్యవహారం కోసం వస్తున్నాడా?, అసలు రామ్ చరణ్ కి అక్కడ పనేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగానే రామ్ చరణ్ పార్లమెంట్ లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దాని వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు, కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే ఆ మూవీ టీం పార్లమెంట్ ని షూటింగ్ కోసం ఒక రోజు ఇవ్వాలని కోరారట. ఇదే ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్. ప్రస్తుతం రాంచరణ్ బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి.
Also Read : రామ్ చరణ్ హిట్ కొడితే ఎన్టీఆర్ బాధపడక తప్పదు.. లాజిక్ ఇదే!
‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఎలా అయిన కుంభస్థలం బద్దలు కొట్టాలి అనేంత కసితో ఉన్నారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం ఢిల్లీలో కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన సన్నివేశం పార్లమెంట్ లో జరుగుతుందట. సన్నివేశం చూసే ఆడియన్స్ కి సహజం గా ఉండాలనే దృక్పధంతో పార్లమెంట్ ని ఒక రోజు షూటింగ్ కోసం తీసుకోవాలని మూవీ టీం చూస్తున్నారట. ఒకప్పుడు అయితే చాలా తేలికగానే షూటింగ్ కోసం పార్లమెంట్ ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఇవ్వడం లేదు. దాని కోసం ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మూవీ టీం కి ఎంత ప్రయత్నం చేసిన అనుమతులు లభించడం లేదట. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సంప్రదించారట మూవీ టీం.
పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ లో ఎలాంటి పలుకుబడి ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే ఆయన పలుకుబడి ని ఉపయోగించి పార్లమెంట్ ని ఒక రోజు షూటింగ్ కోసం ఇప్పించేలా చేయమని కోరారట. పవన్ కళ్యాణ్ కూడా అందుకు సానుకూలంగా రెస్పాన్స్ ఇచ్చాడట. చూడాలి మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్(Jhanvi Kapoor) నటిస్తుండగా, శివ రాజ్ కుమార్ అత్యంత కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి రెహమాన్ ఎంట్రీ ఇచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారట. తన కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ అవుతుందని రామ్ చరణ్ ఇది వరకు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
Also Read : రామ్ చరణ్ సినిమాకి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్..షాక్ లో ఫ్యాన్స్..కారణం ఏమిటంటే!