Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Movie: ఆ మూడు సినిమాల స్టోరీ లను కాపీ చేసి పెద్ది...

Ram Charan Peddi Movie: ఆ మూడు సినిమాల స్టోరీ లను కాపీ చేసి పెద్ది మూవీ చేశారా..?

Ram Charan Peddi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారిలో రామ్ చరణ్ ముందు స్థానంలో ఉన్నాడు. రాజమౌళి తో చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువ క్రేజ్ అయితే దక్కింది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా […]

Ram Charan Peddi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారిలో రామ్ చరణ్ ముందు స్థానంలో ఉన్నాడు. రాజమౌళి తో చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువ క్రేజ్ అయితే దక్కింది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా లో ప్రధానంగా మూడు స్పోర్ట్స్ లను హైలైట్ చేస్తూ సినిమానైతే తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో క్రికెట్ ప్లేయర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నర్ గా కూడా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇంతకుముందు ఇలాంటి పాత్రను ఎప్పుడూ పోషించలేదు. కాబట్టి అతనికి ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ప్రధానంగా మూడు కథలను కాపీ చేసి తెరకెక్కించారట. ఆ కథలు ఏంటి అంటే అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘లగాన్’ సినిమాలోని క్రికెట్ పాయింట్ ను తీసుకున్నారు.

అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ ఫైట్ ని ఈ సినిమాలో మెయిన్ పాయింట్ గా రాసుకున్నారు. ఇక దాంతోపాటుగా ‘బాగ్ మిల్కా బాగ్’ లోని రన్నింగ్ రేస్ ని సైతం ఈ సినిమాలో భాగం చేస్తూ చివరలో దానికి ఒక క్లారిటి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మూడు కథలను బేస్ చేసుకొని బుచ్చిబాబు ఈ కథనైతే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి రామ్ చరణ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదంటే కాపీ సినిమాలతో వస్తుంది కాబట్టి ఈ సినిమా భారీ డీలా పడిపోతుందా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…గత సంవత్సరం రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper