Peddi Item Song Controversy: ‘పెద్ది'(Peddi Movie) మూవీ టీం పట్ల సోషల్ మీడియా లో రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలం లో ఒక సినిమా పై హైప్, క్రేజ్ క్రియేట్ అవ్వడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైరెక్టర్ ఎవరు అనేది చూడడం లేదు, కేవలం కంటెంట్ ని చూస్తున్నారు , ఆ కంటెంట్ బాగుంటేనే టికెట్స్ తెంచడానికి సిద్ధం అవుతున్నారు. చాలా కాలం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ‘పెద్ది’ సినిమా ద్వారా ఇలాంటి హైప్ ఆర్గానిక్ గా క్రియేట్ అయ్యింది. కానీ మేకర్స్ ఆ హైప్ ని నాశనం చేస్తున్నారు అంటూ రామ్ చరణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమాని రెండు సార్లు వాయిదా వేయడం వల్ల హైప్ కాస్త తగ్గింది, ఇప్పుడు ఐటెం సాంగ్ విషయం లో అభిమానులకు చిరాకు కలిగించేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు ఈ ఐటెం సాంగ్ మృణాల్ ఠాకూర్ రామ్ చరణ్ తో కలిసి చిందులు వేయబోతుంది అంటూ ప్రచారం చేశారు. మృణాల్ ఠాకూర్ తో చర్చలు జరిపిన విషయం వాస్తవమే , కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఆమె ఈ పాటలో కనిపించబోవడం లేదు. ఇక ఆ తర్వాత యంగ్ హీరోయిన్ మానస వారణాసి పేరు కూడా వినిపించింది. ఈము ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆమెని సంప్రదిస్తే ఒప్పుకోకుండా ఉండదు , ఆమెకు ఈ అవకాశం చాలా గొప్పది , కానీ మేకర్స్ సంప్రదించలేదు , కేవలం ఆమె అయితే ఎలా ఉంటుంది అని ఆలోచన మాత్రమే చేశారు. ఇక నిన్న అయితే సంయుక్త మీనన్ పేరు కూడా వినిపించింది , ఇప్పుడు చివరికి శృతి హాసన్ లాక్ అయ్యినట్టు తెలుస్తుంది . ఈ విషయం లో కూడా మేకర్స్ లో స్పష్టత లేదు.
అందుకే నేటి నుండి జరగాల్సిన ఈ సాంగ్ షూటింగ్ ని ఏప్రిల్ 26 కి వాయిదా వేశారు. ఒక్క ఐటెం సాంగ్ కి హీరోయిన్ ఫిక్స్ చేసుకునే విషయం లో ఇంత జాప్యం చూపించడం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఐటెం సాంగ్ కోసం మామూలుగా దర్శక నిర్మాతలు ట్రెండింగ్ లో ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ ని తీసుకుంటారు. కానీ ఇక్కడ శృతి హాసన్ ని తీసుకోవడం లో ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని అంటున్నారు. శ్రీలీల , భాగ్యశ్రీ భొర్సే , అలియా భట్ రేంజ్ హీరోయిన్స్ ని ఐటెం సాంగ్ కోసం తీసుకుంటే సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది , ట్రెండింగ్ లో లేని హీరోయిన్స్ ని తీసుకొని ఉపయోగం ఏంటి అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.