Homeఎంటర్టైన్మెంట్Peddi movie shooting updates: పుట్టినరోజు నాడు గాయంతోనే 'పెద్ది' షూటింగ్ లో పాల్గొన్న...

Peddi movie shooting updates: పుట్టినరోజు నాడు గాయంతోనే ‘పెద్ది’ షూటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్.. వీడియో వైరల్..

Peddi movie shooting updates: అభిమానులకు ఆనందం ఇవ్వడం కోసం మెగా హీరో ఎంత దూరమైనా వెళ్తారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆరోజుల్లో షూటింగ్ జరుగుతున్న సమయాల్లో ఎన్ని గాయాలైన నిర్మాతలకు నష్టం కలిగించకూడదు అనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ లో పాల్గొనే వాడు. 105 కి పైగా జ్వరం ఉన్న రోజుల్లో కూడా ఆయన షూటింగ్స్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. మన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు , మనల్ని నమ్మి కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాతలు ఎలాంటి ఇబ్బందికి గురి అవ్వకూడదు అనే గొప్ప సిద్ధాంతం మెగాస్టార్ చిరంజీవి సొంతం. తనలో ఉన్న ఈ లక్షణాన్ని పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్(Global Star Ram Charan) మరియు ఇతర మెగా హీరోలకు కూడా అలవాటు చేసాడు. అందుకు ఉదాహరణ రీసెంట్ గా జరిగిన ఒక సంఘటనే. ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ సమయం లో రామ్ చరణ్ కి గాయమైన సంగతి తెలిసిందే.

ఆయన కంటి రెప్ప పైన నాలుగు కుట్లు కూడా పడ్డాయి. డాక్టర్లు కచ్చితంగా ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు, కానీ రామ్ చరణ్ అసలు మాట వినలేదు. బ్యాండేజ్ వేసుకొని మరుసటి రోజు షూటింగ్ సెట్స్ లో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇది చూసిన అభిమానులు తండ్రికి తగ్గ తనయుడు , ఆ మాత్రం ఉంటుంది. నేడు ఆయన పుట్టినరోజు, అయినప్పటికీ కూడా పచ్చిగా ఉన్న గాయం తోనే షూటింగ్ లో పాల్గొన్నాడు. ఏప్రిల్ 30 న ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే కసితో మూవీ టీం మొత్తం పని చేస్తోంది, అందుకు రామ్ చరణ్ సంపూర్ణంగా సహకరిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ ఎంతలా ప్రాణం పెట్టి పని చేస్తున్నాడో చెప్పడానికి నేడు విడుదల చేసిన టీజర్ ఒక ఉదాహరణ.

Also Read: ‘ధురంధర్ 2 ‘ మేకర్స్ చేతుల్లోకి ‘పెద్ది’..కానీ సినిమా వాయిదా దాదాపుగా ఖరారు అయ్యినట్టే..

ఈ సినిమా కోసమే ఆయన తన శరీరాన్ని బీస్ట్ లాగా తయారు చేసాడు. అంతే కాదు ఈ చిత్రం లో రామ్ చరణ్ మూడు వేరియేషన్స్ లో కూడా కనిపించబోతున్నాడు. దీని బట్టీ ఈ సినిమా కోసం ఆయన ఎంత డెడికేషన్ తో పని చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అభిమానులకు , థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు ఇప్పటి వరకు ఆడియన్స్ అనుభూతి చెందని అద్భుతమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించబోతున్నారు మేకర్స్. మరో పక్క పర్ఫెక్షన్ కోసం ఈ చిత్రాన్ని జూన్ కి వాయిదా వేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరో వారం రోజుల్లోపు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular