Homeబిజినెస్Vespa new technology scooters: స్కూటర్లపై డ్రైవ్ చేసేవారికి గుడ్ న్యూస్.. Vespa తెస్తున్న...

Vespa new technology scooters: స్కూటర్లపై డ్రైవ్ చేసేవారికి గుడ్ న్యూస్.. Vespa తెస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఇదే..

Vespa new technology scooters: ఇప్పుడు అంతా స్కూటర్లదే అవా కొనసాగుతోంది. ఇప్పటివరకు బైక్స్ నడిపిన వారు సైతం స్కూటర్లను మార్చుకుంటున్నారు. అయితే ఇవి గతంలో ఉన్న స్కూటర్లు లాగా కాకుండా కొత్త కొత్త డిజైన్తో మార్కెట్లోకి వస్తున్నాయి. రోజువారి వినియోగదారులతో పాటు యూత్ ను ఆకర్షించే విధంగా స్టైలిష్ గా వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీ Vespa తన స్కూటర్లను అప్డేట్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఎంతో ఆదరణ పొందిన Primavera, Sprint S అనే మోడల్స్ ను నేటి తరం వారిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఇందులో టెక్నాలజీని అప్డేట్ చేసి.. ఇంజన్ పనితీరులో కొన్ని మార్పులు చేశారు. పియా జియో సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్కూటర్లు ఎలా ఉండబోతున్నాయి అంటే?

ప్రస్తుతం స్కూటర్లు కొనేవారు స్మార్ట్ టెక్నాలజీ ని ఎక్కువగా కోరుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా కీ లెస్ స్కూటర్ల పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇలాంటి వారికి అనుకూలంగా వెస్పా తన స్కూటర్లలో కీలెస్ సిస్టం ను ప్రవేశపెట్టింది. దీంతో స్కూటర్పై కి పెట్టకుండానే స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఫైండ్ మై వెహికల్ వంటి ఫీచర్ ఉండడంతో స్కూటర్ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. దీని డిజైన్ కూడా మార్చి వేసినట్లు తెలుస్తోంది.5 స్పోక్ డిజైన్తో కూడిన 12 అంగుళాల అలా వీల్స్ ఆకర్షనీయంగా ఉండనున్నాయి. అలాగే ముందటి భాగంతో పాటు సైడ్ గ్రిల్ కూడా మార్చివేశారు.

ఈ స్కూటర్లలో సేఫ్టీ ఫీచర్లు ఎక్కువగా చేర్చారు. ఇప్పటివరకు ఉన్న డ్రం బ్రేకుల స్థానంలో 220 mm రియర్ డిస్క్ బ్రేక్ లను చేర్చింది. డ్యూయల్ పిస్టన్ కాలిపర్ కూడా ఇందులో కనిపిస్తుంది. అలాగే ABS టెక్నాలజీ, బ్రేకింగ్ వ్యవస్థ పూర్తిగా మార్చి వేసినట్లు తెలుస్తుంది. దీంతో రైడర్లకు దూర ప్రయాణం చేసినా కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఉన్న స్కూటర్ల కంటే ఇప్పుడు దీనిపై స్మూత్ గా వెళ్లొచ్చు. ఇంజన్ విషయంలోనూ ఈ స్కూటర్లలో కొన్ని మార్పులు చేశారు. పెట్రోల్ వేరియంట్లు అయిన 50 cc సామర్థ్యం గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్, 3 వాల్వ్ ఎంజాయ్లను ఉపయోగిస్తున్నారు. నగరాల్లోని వారికి స్టైలిష్ గా ఉండడంతోపాటు స్మూత్ డ్రైవింగ్ కోసం ఇవి సహకరిస్తాయి.

ఇక వీటిలో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు కనిపించనున్నాయి. స్కూటర్ ముందటి భాగంలో ఎల్సిడి స్క్రీన్ కనిపిస్తోంది. ఇది పూర్తిగా డిజిటల్ మయం కావడంతో స్మూత్ స్క్రోలింగ్ చేయవచ్చు. పై అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే కూడా చూడొచ్చు. వీటికి మొబైల్ కనెక్ట్ తో పాటు మ్యూజిక్ కంట్రోల్, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇలా అప్డేట్ అయినా వెస్పా స్కూటర్లు త్వరలో భారత మార్కెట్లోకి రానున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular