Homeఎంటర్టైన్మెంట్Ram Charan: చిరంజీవి చేయలేని సినిమాను రామ్ చరణ్ చేయబోతున్నాడా..?

Ram Charan: చిరంజీవి చేయలేని సినిమాను రామ్ చరణ్ చేయబోతున్నాడా..?

Ram Charan: ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించిన ‘రామ్ చరణ్’ కి ఇండియా వైడ్ గా చాలా మంచి పాపులారిటీ ఉంది… మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా వాళ్ళ నాన్న పేరు వాడుకోకుండా స్వశక్తితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం అతనితో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని ఇండియాకే పరిమితం చేశాయి. కానీ ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా చూపించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు… ఇక రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే పౌరాణిక పాత్రలవైపు కూడా తను అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది దర్శకులు అతనితో కలిసి పౌరాణికానికి సంబంధించిన సినిమాలను చేయడానికి కథలను కూడా వినిపిస్తున్నారట. ఇక అందులో భాగంగానే ఆయన రాముడి పాత్రను చేయడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…

Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!

ఇక ఇప్పటివరకు చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారి కూడా రాముడి పాత్రను పోషించలేదు. కాబట్టి చిరంజీవి చేయని పాత్రను కూడా రామ్ చరణ్ చేయబోతున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ప్రాజెక్టు కి సంబంధించిన విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు.

ఇక ఇది వర్కౌట్ అయితే మాత్రం రామ్ చరణ్ ని తొందర్లోనే మనం రాముడు పాత్రలో చూడొచ్చు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తనదైన రీతిలో నటనను చూపిస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రస్తుతం అతను వైవిద్య భరితమైన పాత్రలు చేస్తేనే విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకునే అవకాశమైతే ఉంటుంది…

ఇక ఇప్పటికే ‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాబట్టి రామ్ చరణ్ రాముడిగా చేస్తే మహేష్ బాబును మైమరపింపజేసేలా తన నటన ఉండాలి. అలా ఉన్నప్పుడే అతను ప్రేక్షకుల్లో ఎక్కువ ఇమేజ్ ను సంపాదించుకోగలుగుతాడు… చూడాలి మరి ఎవరి డైరెక్షన్లో రాముడు పాత్రను పోషించబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్లు దానికి శ్రీకారం చుట్టబోతున్నారా? లేదంటే తెలుగు దర్శకులే ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular