Homeఎంటర్టైన్మెంట్Rajinikanth: షాకింగ్ : రజినీకాంత్ విషాద మాటలకు కన్నీళ్లు పెడుతున్న...

Rajinikanth: షాకింగ్ : రజినీకాంత్ విషాద మాటలకు కన్నీళ్లు పెడుతున్న అభిమానులు

Rajinikanth: సూపర్ స్టార్ అనే ఇమేజ్ కే గౌరవం తెచ్చిన వ్యక్తి రజినీకాంత్. తన సినిమాల్లోని మాటలతో ఎన్నో తూటాలు పేల్చాడు ఆయన. ముఖ్యంగా డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన సూపర్ స్టార్ రజినీకాంత్. రజనీ చేసిన ప్రతి సినిమాల్లోనూ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అద్భుతంగా అనిపిస్తాయి.

Rajinikanth
Rajinikanth

మరి ముఖ్యంగా ఆ డైలాగ్స్ కొన్ని మనసుకు హత్తుకుపోతాయి. మరికొన్ని పవర్‌ఫుల్ పంచ్‌ లుగా మిగిలిపోతాయి. మొత్తానికి సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రజని. ఐతే, తాను అసలు10 శాతం కూడా సంతోషంగా లేనని రజినీకాంత్ చెప్పిన మాటలు.. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది.

Also Read: The Warrior Movie Collections: ‘ది వారియర్’ 12 డేస్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది ? ఇంకెంత రావాలి ?

తాజాగా ‘యోగతా సత్సంగ్ సోసైటీ ఆఫ్ ఇండియా’ సంస్థ ‘హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియా యోగా’ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘ఓం గురువే చరణం’ అంటూ స్పీచ్‌ను స్టార్ట్ చేశారు.

ఇంతకీ రజని ఏమి మాట్లాడారో.. ఆయన మాటల్లోనే విందాం. ‘నా సినీ కెరీర్ లో రాఘవేంద్ర’, ‘బాబా’ వంటి చిత్రాలు నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చాయి. మీకు తెలుసు. ‘నేను ‘బాబా’లో నటించిన తర్వాత చాలా మంది హిమాలయాలకు వెళ్లారు. కొంత మంది నా అభిమానులు సన్యాసం కూడా స్వీకరించారు. ఆ పర్వత ప్రాంతాల్లో ఎన్నో మూలికాలు లభిస్తాయి.

Rajinikanth
Rajinikanth

ఒకసారి మనం వాటిని తింటే.. వారానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి. ఆస్తిపాస్తులతో కాకుండా అనారోగ్యం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యం. అదే ఒక్కసారి అనారోగ్యం బారిన పడ్డాక, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పుడు మనకు అన్నీ ఉన్నా.. ఎన్నో అవరోధాలు వస్తాయి. అందుకే.. ఒక్క వ్యక్తికి శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని నేను నమ్ముతాను.

నేను ఈ మధ్య రెండు సార్లు ఆస్పత్రి పాలైన సంగతి మీకు తెలుసు. నా జీవితంలో నాకు డబ్బు ఉంది. ఫేమ్ ఉంది. కానీ, ఆరోగ్యం లేదు. నేను 10 శాతం కూడా సంతోషం, ప్రశాంతతో లేను’’ అంటూ రజినీకాంత్ ఎమోషనల్ గా చెప్పారు. ప్రస్తుతం రజనీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read:Thank You Movie Collections: ‘థాంక్యూ’ 3 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper