SS Rajamouli Box Office Collections: సినిమా ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ ని సాధించాలి అంటే విపరీతమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదట ఇక్కడ అవకాశం రావడమే చాలా కష్టం…వచ్చిన అవకాశాన్ని సక్సెస్ ఫుల్ గా వాడుకున్న వాళ్లు మాత్రమే నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. ఇక ఆ విషయంలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడనే చెప్పాలి. మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసిన ఆయన ఆ తర్వాత విజువల్ వండర్స్ ని తెరకెక్కించడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియాలో తన పేరు మారుమ్రోగిపోతుంది… భారీ సినిమాలను చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా రికార్డులను సైతం బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.
Also Read: విజయ్- రష్మిక పెళ్లి లో సందీప్ రెడ్డి వంగ కి అవమానం జరిగిందా..? అలా ఎలా చేశారు…
నిజానికి 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? రాజమౌళిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి ‘బాహుబలి 2’ సినిమాతో 1800 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా 1300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. నిజానికి ఇద్దరు హీరోలు కలిసి ప్రభాస్ కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయారు..ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి హ్యాయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ‘దంగల్’ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా 200 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు రాజమౌళి సైతం ఆ రికార్డును బ్రేక్ చేయలేదనే చెప్పాలి.
వారణాసి సినిమాతో ఆ రికార్డు బ్రేక్ అవ్వడమే కాకుండా కొత్త రికార్డును కూడా క్రియేట్ చేసి పెట్టాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు… దానికోసం కొత్త టెక్నాలజీని కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది చేసినా కూడా విజువల్ వండర్ గా ఆ సినిమాని తెరకెక్కించినప్పుడే ప్రేక్షకులు దానికి పూర్తిస్థాయిలో కనెక్ట్ అవుతారు. లేకపోతే మాత్రం వారణాసి సినిమా మీద కూడా నెగెటివిటి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…