Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Wedding: అన్న వదినలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ...విజయ్ అంటే అంత...

Vijay Deverakonda Wedding: అన్న వదినలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ…విజయ్ అంటే అంత ఇష్టమా..?

Vijay Deverakonda Wedding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ కి సపరేట్ గా ఒక స్టైల్ ఉంది. ఆయన ప్రతి సినిమాలో తన స్టైల్ ని మైంటైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈరోజు విజయ్ దేవరకొండ రష్మిక మందానాల పెళ్లి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పెళ్లిలో […]

Vijay Deverakonda Wedding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ కి సపరేట్ గా ఒక స్టైల్ ఉంది. ఆయన ప్రతి సినిమాలో తన స్టైల్ ని మైంటైన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈరోజు విజయ్ దేవరకొండ రష్మిక మందానాల పెళ్లి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పెళ్లిలో విజయ్ దేవరకొండ తమ్ముడు అయిన ఆనంద్ దేవరకొండ అన్న వదిన లకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిజానికి విజయ్ స్టార్ హీరో అవ్వడం వల్లే ఆనంద్ సినిమాల్లోకి వచ్చాడు. విజయ్ లేకపోతే తను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదని పలు సందర్భాల్లో ఆనంద్ తెలియజేశాడు.

Also Read: విజయ్- రష్మిక పెళ్లి లో సందీప్ రెడ్డి వంగ కి అవమానం జరిగిందా..? అలా ఎలా చేశారు…

దాంతోపాటుగా విజయ్ అంటే కూడా ఆనంద్ కి చాలా ఇష్టం ఉండడంతో విజయ్ పెళ్లిలో ఆనంద్ తన ప్రేమనైతే పంచుకున్నాడు… ఇక ఆనంద్ విజయ్ కి ఒక అదిరిపోయే వాచ్ ని ఇచ్చాడు…ఇక ఆనంద్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి రష్మిక కి ఒక ఖరీదైన జ్యూలరీ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది…ఇక వీటితో పాటుగా ఇంకా చాలా గిఫ్ట్ లను ప్లాన్ చేశాడట.

మిగతా గిఫ్టులన్నీ కూడా వీళ్ళ రిసెప్షన్ రోజు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ తను ప్రేమించిన రష్మిక ను పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు తన అభిమానులకు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను విజయ్ దేవరకొండ తనే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం విశేషం…ఇక వాళ్ల పెళ్ళి తక్కువ మంది మధ్య జరిగిన కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది… రాబోయే రోజుల్లో కూడా వీళ్లు వాళ్ళ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper