Rajamouli : ఇండియా లో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు రాజమౌళి(SS Rajamouli). ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన, ఆ తర్వాత ఏ స్థాయిలో ఎదుగుతూ వచ్చాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ దర్శకులు కూడా ఆయన పనితనం పై ప్రశంసల వర్షం కురిపించే పరిస్థితి నెలకొంది. అయితే ఇన్నేళ్ల రాజమౌళి కెరీర్ లో ఎప్పుడూ కూడా వివాదాల్లో చిక్కుకోవడం మనం చూడలేదు. చాలా కూల్ గా ఆయన కెరీర్ సాగిపోయింది. అలాంటి రాజమౌళి ఇప్పుడు సరికొత్త వివాదం లో చిక్కుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. అతని స్నేహితుడు శ్రీనివాసరావు రాజమౌళి చేసే టార్చర్ ని భరించలేక చనిపోవాలని అనుకుంటున్నాను అంటూ పోలీసులకు లేఖ రాసి, సెల్ఫీ వీడియో ని కూడా విడుదల చేసాడు. దీనిని చూసిన తర్వాత నెటిజెన్స్ రాజమౌళి లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ ఆయన వీడియో లో ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘నేను, రాజమౌళి ఎన్నో ఏళ్ళ నుండి ప్రాణ స్నేహితులు గా కొనసాగుతున్నాం. ‘యమదొంగ’ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నా పేరు కూడా టైటిల్ కార్డ్స్ లో పడుతుంది, మీరు అది గమనించగలరు. మా కెరీర్ సజావుగానే సాగింది కానీ, మా మధ్య ఒక చిన్న సమస్య ఏర్పడింది. నేను, రాజమౌళి, ఒక అమ్మాయి. మా ముగ్గురి మధ్య ‘ఆర్య 2′ లాంటి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని రాజమౌళి తో చెప్తే,కుదరదు నువ్వు త్యాగం చేయాల్సిందే అని అన్నాడు. పోనీ నువ్వే పెళ్లి చేసుకో ముగ్గురం కలిసి ఉందాం అని అన్నాను, సమాజం చూస్తే ఛీ కొడుతోంది అని రాజమౌళి అన్నాడు. మరి ఇప్పుడేమి చేయాలి అని అడిగితే, నువ్వు త్యాగం చేయాల్సిందే తప్పదు అన్నాడు’.
‘సరే అని వాడికోసం త్యాగం చేశాను. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటి వరకు నాకు పెళ్లి జరగలేదు, సింగిల్ గానే ఉన్నాను, నా జీవితం ఇలా తయారైంది. నేను మా ముగ్గురి మ్యాటర్ ని ఎవరికో చెప్పానని, ఇప్పుడు రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఆ టార్చర్ భరించలేకపోతున్నాను, ఇక నా వల్ల కాకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదేదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసం చేయడం లేదు. నేను చనిపోయాక మీ అందరికీ అర్థం అవుతుంది, నేను చెప్పింది నిజమని. రాజమౌళి ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్ అయ్యేలోపు వాడి ఇష్టమొచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇంకా చాలా చెప్పాడు, క్రింది వీడియోలో చూడండి. రాజమౌళి నుండి ఊహించని ఈ కోణాన్ని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఆ ఒక్కటి రాజమౌళి ఒక్కడికే ఎందుకు సాధ్యం అవుతుంది… మిగతా దర్శకులు ఎందుకు చేయలేకపోతున్నారు..?
వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి
జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు
రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్
రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు
యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా… pic.twitter.com/JMRRaJwp3c
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2025