Mars : విశ్వంలోని అంగారకుడి పై 300 కోట్ల సంవత్సరాల నాటి బీచ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా దేశానికి చెందిన జురాంగ్ రోవర్ ఈ డేటా అందించింది. దాని ఆధారంగా అంగారకుడి పై 300 కోట్ల సంవత్సరాల నాటి బీచ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంగారకుడి పై నీరు ఒకప్పుడు ప్రవహించిందని.. అక్కడి వాతావరణం కొన్ని జీవుల పెరుగుదలకు దోహదపడిందని 1970లో నాసా(NASA) కు చెందిన మెరైనర్ -9 వ్యోమనౌక తీసిన చిత్రాలలో 10 వెళ్లడైంది.. అయితే అంగారక గ్రహంపై జలధార ఉందనే విషయం స్పష్టమైనది.. ఇక అప్పటినుంచి అనేక దేశాలు వివిధ ప్రయోగాలు చేయడం ద్వారా అంగారక గ్రహం పై నీటి ప్రవాహం ఉందని అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ గ్రహంపై 450 కోట్ల సంవత్సరాల క్రితం నీరు ఉండేదని.. అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష శిలలు ఢీకొన్నాయి. ఫలితంగా అక్కడ బిలాలు ఏర్పడ్డాయి. వాటి కింద కూడా మంచు ఫలకాలు ఉన్నట్టు తేలింది.
Also Read : ఒక బిడ్డ అంగారక గ్రహంపై పుడితే ఏమి జరుగుతుంది.. తను భూమిపై జన్మించిన వాళ్ల కంటే ఎంత భిన్నంగా ఉంటాడు
ఎప్పుడు ఉండేదంటే
అంగారక గ్రహం పై నీరు ఎప్పుడు ఉన్నది? ఎంత పరిమాణంలో ఉన్నది? ఆ నీటిలో జీవులు ఎంతకాలం మనుగడ సాగించాయి? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. గతంలో అంగారక గ్రహం పై మహాసముద్రాలు ఉండేవా? అనే ప్రశ్న శాస్త్రవేత్తలకు సవాల్ గా మారింది. ఈ ప్రశ్నను నిజం చేస్తూ చైనా అంతరిక్ష సంస్థ (CSS) అంగారకుడి పైకి జురాంగ్ రోవర్ ను పంపగా.. అది అందించిన డేటా అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. చైనా, అమెరికా శాస్త్రవేత్తలు చైనా రోవర్ అందించిన డేటా ఆధారంగా పరిశోధనలు చేపట్టారు. అంగారకుడి ఉపరితలంపై ఉన్న శిలలపై ఉటోపియా ప్లానీషియా అనే ప్రాంతంలో రోవర్ లోతైన పరిశోధన చేపట్టింది. ఆ పరిశోధన ప్రకారం ఒకప్పుడు అక్కడ మహా సాగరం ఉండేదని.. దానివల్ల తీర ప్రాంత అవక్షేపాలు ఉండేవని తెలుస్తోంది. దాని ప్రకారం అక్కడ ఒక బీచ్ కూడా ఉండేదని సమాచారం..” ఈ ప్రాంతంలో ఇప్పుడు నీరు లేదు. కానీ ఒకప్పుడు మహాసముద్రాలు ఉండేవి. 400 కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ కొన్ని రకాల జీవులు కూడా జీవించాయి. ఆ తర్వాత అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక్కడ ఆక్సిజన్ ఆనవాళ్లు లేవు. జీవులు జీవించడానికి అనువుగా లేని హైడ్రోజన్, ఇతర వాయువులు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల జీవులు జీవించే పరిస్థితి లేదు. ఇంకా లోతైన పరిశోధనలు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని” శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగారకుడి పై భార రహిత స్థితి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల మనుషులు తేలియాడుతుంటారు. అయితే ఇక్కడ ఉండే వాయువులలో ఎక్కువ శాతం కార్బన్ మోనాక్సైడ్, హీలియం, హైడ్రోజన్ అధికంగా ఉంటాయి కాబట్టి జీవులు జీవించే ఆస్కారం లేదు. కాకపోతే 450 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న మహా సముద్రాలు ఎలా కాలగర్భంలో కలిసిపోయాయనేది చూడాల్సి ఉందని.. శాస్త్రవేత్తలు అంటున్నారు.
Also Read : అంగారకుడిపై నీటి ప్రవాహం ఉండేది… తిరుగులేని సాక్ష్యం చూపించిన నాసా!