IND vs PAK : దుబాయ్ వేదికగా భారత జట్టుతో పాకిస్తాన్ రెండో మ్యాచ్ ఆడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ దాదాపుగా నిష్క్రమించింది.. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును ఓడించగా.. పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం పోటీ తత్వాన్ని ఇవ్వకుండా చేతులెత్తేసింది. ఒకరకంగా జింబాబ్వేతో సరిసమానమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. అందువల్లే పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ” టెస్ట్ ఫార్మాట్ లో స్వదేశంలో వెయ్యి రోజుల వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడేమో స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బంగ్లాదేశ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడాలి. ఇందులో కూడా ఓడిపోతే పాకిస్థాన్ పరువు మొత్తం పోతుంది.. అప్పుడు జట్టు మేనేజ్మెంట్ ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదని” పాక్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. సోషల్ మీడియాలో పాక్ ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Also Read : పాపం పాక్…కోట్లు వెచ్చించి.. కొత్త కోచ్ ను నియమించుకున్నా ఓటమి తప్పలేదు
పాక్ కోచ్ ఏమంటున్నాడంటే..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ త్వరగా నిష్క్రమించడానికి ప్రధాన కారణం ఏమిటో ఆ జట్టు కోచ్ అకిబ్ జావేద్ వెల్లడించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనాన్ని కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టులో ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ.. వాటిని సరిచేయకుండా ఛాంపియన్స్ ట్రోఫీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ” టీమిండియాలో ప్లేయర్లు మొత్తం 1500 మ్యాచులు ఆడారు. పాకిస్తాన్ ఆటగాళ్లు మొత్తం మ్యాచులు 400 కు మించలేదు. బాబర్ ఆజామ్ మాత్రమే వందకు పైగా మ్యాచ్లు ఆడాడు. అలాగే ఒకే గ్రౌండ్లో ఆడటం కూడా భారత జట్టుకు అడ్వాంటేజ్ గా మారిందని” అకిబ్ జావేద్ వ్యాఖ్యానించాడు.. అయితే జావేద్ వ్యాఖ్యలపై పాక్ అభిమానులు మండిపడుతున్నారు. ” అనుభవం లేదని మీరే చెబుతున్నారు. అడ్వాంటేజ్ ఉందని కూడా మీరే చెబుతున్నారు. అలాంటప్పుడు జట్టులో ఎందుకు మార్పులు చేయలేకపోయారు? జట్టును గెలుపు దిశగా ఎందుకు నడిపించలేకపోయారు? ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టుకు డిపెండింగ్ ఛాంపియన్ హోదా ఉందన్న విషయం తెలియదా. ఆ విషయాన్ని మర్చిపోయి జట్టును ఎంపిక చేశారా? ఇప్పుడు ఈ వరుస పరాజయాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలా ఓడిపోతే జట్టుపస్థితి ఏమవుతుంది? స్పాన్సర్లు ముందుకు వస్తారా?” అని పాక్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : ఇబ్రహీం జద్రాన్.. ఈ పేరు ఇంగ్లాండ్ జట్టు ఇప్పట్లో మర్చిపోదు.. ఎందుకంటే అతడు ఆడిన ఇన్నింగ్స్ అటువంటిది