Pushpa 2: మరో పది రోజుల్లో పుష్ప 2 థియేటర్స్ లోకి రానుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇండియాలో గల ప్రధాన నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా భారీ రెస్పాన్స్ దక్కింది. నార్త్ లో అల్లు అర్జున్ నయా ట్రెండ్ సెట్ చేశాడు. పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించే కల్చర్ బాలీవుడ్ లో లేదు.
అలాగే చెన్నై వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందాన, శ్రీలీలతో పాటు దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అతిథిగా హాజరయ్యారు. పెద్ద మొత్తంలో పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓపెనింగ్స్ ద్వారా భారీగా రాబట్టాలని మేకర్స్ ప్లాన్. అందుకే కాంప్రమైజ్ కాకుండా ప్రమోషన్స్ కి ఖర్చు చేస్తున్నారు.
ఇక ప్రమోషన్స్ లో భాగంగానే చిత్రంలోని ఒక్కో సాంగ్ విడుదల చేస్తున్నారు. పుష్ప మూవీకి సమంత నటించిన ‘ఊ అంటావా మామా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సాంగ్ యువతను ఊపేసింది. ఈ క్రమంలో సీక్వెల్ లో కూడా హాట్ అండ్ గ్లామరస్ ఐటెం సాంగ్ ని డిజైన్ చేశారు. ఈ సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. కిస్సిక్ పేరుతో విడుదలైన ఈ సాంగ్ భారీ ఆదరణ దక్కించుకుంటుంది.
కిస్సిక్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. రికార్డుల మోత మోగిస్తుంది. 18 గంటల వ్యవధిలో 25 మిలియన్ వ్యూస్ రాబట్టింది. సౌత్ ఇండియాలో తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన సాంగ్ గా కిస్సిక్ రికార్డులకు ఎక్కింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేశారు. సాంగ్ సక్సెస్ నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ గ్రేట్ డాన్సర్ కాగా, శ్రీలీల ప్రొఫెషనల్ డాన్సర్. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులకు ఫీస్ట్ కానుందని భావిస్తున్నారు. కిస్సిక్ సాంగ్ కి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. సుబ్లాష్ని పాడింది. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
Web Title: Pushpa 2kissing song which is shaking the internet is a south indian record out
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com