Homeఎంటర్టైన్మెంట్Puneeth Rajkumar: నెట్టింట వైరల్ గా మారిన పునీత్... ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో

Puneeth Rajkumar: నెట్టింట వైరల్ గా మారిన పునీత్… ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబరు 29న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో కర్నాటక ప్రజలు శోక సంద్రంలో మునిగి పోయారు. ఆయన లేని లోటు కేవలం కన్నడ సినీ పరిశ్రమకే కాక ఫిల్మ్  ఇండస్ట్రి మొత్తానికి లోటు అనే చెప్పాలి. ఆయన చనిపోవడానికి ముందు రోజు తన అన్న శివరాజ్ కుమార్ సినిమా వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న పునీత్… అకస్మాత్తుగా కన్నుమూయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

puneeth raj kumar house cc tv footage goes viral on social media

పునీత్‌ శరీరకంగా ఫిట్ గా ఉంటారాన్ని సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఆయనకు గుండెపోటు రావడం ఏమిటని అందరూ ఆశ్చర్య పోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ అస్వస్థతకు గురయ్యారని మీడియా లో కధనాలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని ఆయన కుటుంబ సభ్యులే కాకుండా… టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఇప్పుడు పునీత్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియొ లో కాస్త ఆందోళనగా ఉన్న పునీత్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కడాన్ని గమనించవచ్చు. అలానే ఆ సమయంలో పునీత్  అస్వస్థతకు లోనైట్లు కనిపించలేదు. బయటకు వచ్చిన తర్వాత భార్యతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత ఇద్దరు కారులో బయల్దేరారు. అనంతరం డాక్టర్ రమణారావును కలిసిన పునీత్… వైద్య పరికాశాలు చేయించుకున్నారు. ఈసీజీ తీసిన తర్వాత ప్రమాదాన్ని గుర్తించిన డాక్టర్ రమణారావు  వెంటనే ఆయన్ని విక్రమ్ హాస్పిటల్‌ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పునీత్ హాస్పిటల్‌కు బయల్దేరగా… కారులోనే పునీత్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular