HomeNewsTiger Nageswararao: స్టువర్టుపురం దొంగగా రవితేజ.. ఎవరి బయోపిక్​ అంటే!

Tiger Nageswararao: స్టువర్టుపురం దొంగగా రవితేజ.. ఎవరి బయోపిక్​ అంటే!

Tiger Nageswararao: వరుస విజయాలతో దూసుకెళ్తున్న మాస్​మహారాజ రవితేజ.. ప్రస్తుతం సినిమా మీద సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు. ఇప్పటికే నాలుగు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్న రవితేజ.. తాజాగా మరో సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. వంశీ దర్శత్వంలో టైగర్​ నాగేశ్వర్​రావు చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు మాస్​రాజ. ఈ సినిమా తెలుగు, తమిళ్​, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్​ను విడుదల చేశారు.

hero-raviteja-new-movie-with-director-vamsi-named-as-tiger-nageswararao

కాగా, స్టువర్టుపురంలో దోపిడీదారులు ఉండేవారని.. టైగర్​ నాగేశ్వర్​రావు సినిమా సినిమా ఇదే  నేపథ్యంలోతెరకెక్కనున్నట్లు చిత్రబృందం ట్విట్టర్​ వేదికగా తెలిపింది. స్టువర్టుపురం ముఠాలో నాగేశ్వరరావు ఒకరు. అతని తెగింపుకు గుర్తుగా టైగర్​ అనే బిరుదు ప్రకటించారు. 1970లలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించారు. చిక్కినట్లే చిక్కి ఎవ్వరికీ కనిపించకుండా మాయమయ్యేవారు.ఒకానొక సమయంలో చెన్నై జైలు నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నాడు. 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు.

కాగా, దోపిడీదారు నాగేశ్వరరావు గురించి దర్శకుడు వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగేశ్వరరావు కేవలం దొంగగా మాత్రమే చాలా మందికి తెలుసని.. ఆయన జీవితంలో అంతకుమించిన కోణాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. అతని రాబిన్​హుడ్​ తరహా జీవితం ఉండేదని అన్నారు. అతను కొల్లగొట్టిన సంపదను పేదలకు దానం చేసేవాడని.. స్టువర్టుపురంలో పుట్టిన కారణంగా నాగేశ్వరరావు చదువుకు దూరమయ్యారని అన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది పిల్లల చదువుకు ఆయన సాయం చేసేవాడని వంశీ తెలిపారు. ఇలా ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయని వంశీ అన్నారు. దొంగాట సినిమాకు ముందే ఈ బయోపిక్ గురించి పరిశోధన ప్రారంభించినట్లు వంశీ తెలిపారు. అభిషేక్​ అగర్వాల్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.  జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీత దర్శకుడు. కాగా, త్వరలోనే ఈ సినిమా హీరోయిన్​, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular