Upendra : ఈ ఏడాది కన్నడ సినీ పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితి ని ఎదురుకున్న సంగతి తెలిసిందే. అక్కడి సూపర్ స్టార్స్ లో ఒకరైన పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం ఆ ఇండస్ట్రీ కి తీరని లోటు. ఆయన సినిమాలు లేకపోవడం వల్ల ఇండస్ట్రీ కి ప్రతీ ఏడాది వంద కోట్లకు పైగా నష్టం. ఇక ఈ ఏడాది అయితే అక్కడి స్టార్ హీరోలలో ఒకరైన దర్శన్ జైలు పాలవ్వడంతో ఆయన నుండి కూడా ఒక్క సినిమా రాలేదు. సుదీప్, యాష్ వంటి స్టార్స్ కూడా ఈ ఏడాది వాళ్ళ వైపు నుండి సినిమాలను విడుదల చేయలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన కన్నడ చిత్రం ‘మార్టిన్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇలాంటి గడ్డు పరిస్థితిలో సీనియర్ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన UI చిత్రం కన్నడ చలన చిత్ర పరిశ్రమకు ఒక కొత్త ఊపిరి ని ఇచ్చింది.
భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఉపేంద్ర దర్శకత్వం లో వచ్చే సినిమా నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏవైతే ఆశిస్తారో, అంతకు మించే ఈ సినిమాలో ఉండడంతో కలెక్షన్స్ భారీ రేంజ్ లో వస్తున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి 3,45,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. కన్నడ ఇండస్ట్రీ లో ఈ సంవత్సరం ఇంతటి రెస్పాన్స్ ని దక్కించుకున్న సినిమా మరొకటి లేదు. అదే విధంగా తెలుగు లో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా సిటీస్ లో పుష్ప 2 తో సమానంగా హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం గమనార్హం. మన తెలుగులో ఉపేంద్ర కి ఇలాంటి రెస్పాన్స్ దక్కి చాలా కాలమే అయ్యింది.
మూడు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మూడు కోట్ల రూపాయలకు పైగానే జరిగింది. షేర్ ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు తెలుగులో కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే ఇంకో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. క్రిస్మస్ వీకెండ్ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి ఇప్పటి వరకు 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. కేవలం నాలుగు కోట్ల రూపాయిల ఖర్చు తో తీసిన ఈ సినిమా ఇప్పటికే లాభాల్లో ఉంది. భవిష్యత్తులో ఇంకెంత లాభాలు రాబోతున్నాయి చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: The budget is only 4 crore rupees but do you know how much the film ui collected in 3 days upendra oora mass kottudu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com