Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: హౌస్ లోకి వచ్చిన అతిథులతో ప్రేరణ దురుసు ప్రవర్తన..ఇంత బలుపు...

Bigg Boss Telugu 8: హౌస్ లోకి వచ్చిన అతిథులతో ప్రేరణ దురుసు ప్రవర్తన..ఇంత బలుపు యాటిట్యూడ్ అవసరమా?

ప్రేరణ దురుసుతనం కి ఉదాహరణగా నిల్చింది నిన్నటి ఎపిసోడ్. అతిధి దేవోభవ అని పెద్దలు అంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన అతిధులు శత్రువులు అయినా సరే గౌరవించి పంపాలి. అది మనిషి తత్త్వం, ఈ విషయం లో విష్ణు కి ప్రేరణ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

Bigg Boss Telugu 8: ప్రేరణ లాంటి దురుసుతనం,పొగరు, బలుపు యాటిట్యూడ్ ఉన్న కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. జనాలు ఇవన్నీ చూస్తున్నారా అసలు?, చూసి కూడా ఈమెకు ఎలా ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. అన్ని యాంగిల్స్ లోనూ ప్రేరణ కంటే యష్మీ బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ టాప్ 5 వరకు వచ్చేందుకు అర్హురాలు. కానీ ఆమెని మాత్రం బయటకి పంపేశారు అని కొంతమంది విశ్లేషకులు బాధపడుతున్నారు. వాళ్ళ అంచనా ప్రకారం ప్రేరణ సేవ్ అవ్వడానికి ప్రధాన కారణం ఆమె హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఏర్పాటు చేసుకున్న పీఆర్ టీం వల్లనే అని అంటున్నారు. బిగ్ బాస్ హిస్టరీ లో ఈమెకు ఉన్నంత బిగ్గెస్ట్ పీఆర్ టీం ఏ కంటెస్టెంట్ కి కూడా లేదట. ఆమె సేవ్ అవ్వడానికి, టాప్ 5 లోకి వెళ్లే రేంజ్ లో ఉండడానికి ఆమె పీఆర్ టీమే బ్రహ్మాస్త్రం.

ప్రేరణ దురుసుతనం కి ఉదాహరణగా నిల్చింది నిన్నటి ఎపిసోడ్. అతిధి దేవోభవ అని పెద్దలు అంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన అతిధులు శత్రువులు అయినా సరే గౌరవించి పంపాలి. అది మనిషి తత్త్వం, ఈ విషయం లో విష్ణు కి ప్రేరణ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. విష్ణు బాగా ఆడినప్పటికీ సంచాలక్స్ ఆమెకు అన్యాయం చేసి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి వెళ్లారు, అయినప్పటికీ కూడా విష్ణు ఇంటికి వచ్చిన అతిధులను అవమానించలేదు. ఆమె బాధ పడింది కానీ, చివరికి వాళ్ళని నవ్వుతూనే పంపించింది. కానీ ప్రేరణ మాత్రం సంచాలక్స్ కరెక్ట్ గా వ్యవహరించినా కూడా వాళ్ళ మీద బలుపు యాటిట్యూడ్ చూపించింది. వెళ్ళేటప్పుడు పునర్నవి కౌగలించుకోవడానికి వస్తే, ప్రేరణ వెనక్కి వెళ్ళిపోయింది. అసలు ఏమి జరిగిందంటే నిన్న పెట్టిన మొదటి టాస్క్ ‘జారుతూ గెలువు’ లో ప్రేరణ కంటే గౌతమ్ న్యాయంగా ఆడాడు అంటూ ప్రేరణ కి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తారు.

దీంతో ఆమె టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకుంటుంది. సంచాలక్స్ ముందుగా రూల్స్ పెడుతూ క్రింద పడిన డిస్కులను తీసుకొని తమ నెట్స్ లో వేసుకోవచ్చు కానీ, వేరే విధంగా వాటిని తీసుకొని వెయ్యకూడదు. ప్రేరణ రెండు సార్లు డిస్కులను క్యాచ్ పట్టి తన నెట్ లోకి వేసుకుంటుంది. ఇది న్యాయం కాదు, గౌతమ్ ఇవేమి చేయకుండా న్యాయంగా రూల్స్ ని పాటిస్తూ గేమ్ ఆడుతాడు. అందుకే సంచాలక్స్ గౌతమ్ ని గేమ్ లో ముందుకు తీసుకెళ్లి ప్రేరణ కి బ్లాక్ స్టార్ బ్యాడ్జ్ ని ఇస్తారు. ఇది ప్రేరణకి నచ్చదు. కాసేపు వాదిస్తుంది, కానీ సంచాలక్స్ గౌతమ్ నీకంటే రూల్స్ ని బాగా పాటించి గేమ్ ఆడాడు, అందుకే అతనే విన్నర్ అని గట్టిగా చెప్తారు. ఆ తర్వాత ప్రేరణ వద్దకు వెళ్లి వివరించే ప్రయత్నం చేస్తుంది వితికా, కానీ ప్రేరణ మాత్రం బలుపుతో నాకేమి అవసరం లేదు అని అంటుంది. వెళ్ళేటప్పుడు ఇద్దరినీ అగౌరవ పరిచి పంపిస్తుంది.
One attachment
• Scanned by Gmail

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper