Pushpa 2 : గంగోత్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమా సక్సెస్ అయినప్పటికి ఆయనకు ఏ విధమైన క్రేజ్ అయితే దక్కలేదు. ఇక ఆర్య సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టైలిష్ స్టార్ గా కూడా ఎదిగాడు. ఇక అప్పటినుంచి తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన పుష్ప వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ వస్తున్నాడు. ఇక పుష్ప 2 సినిమాతో అంతకుమించి అనేలా భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన భారీ ప్రణాళికలను రూపొందించి ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో సుకుమార్ అల్లు అర్జున్ భారీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక రీసెంట్ గా యూ బై ఏ సర్టిఫికెట్ ను పొందిన ఈ సినిమా 3 గంటల 20 నిమిషాలు నిడివితో రానున్నట్టుగా తెలుస్తోంది. మరి అంత నిడివి ఉండటం వల్ల సినిమాకి ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా అనే రీతిలో కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనిమల్ సినిమా కూడా దాదాపు 3 గంటలకు పైన నిడివి ఉన్నప్పటికి ఆ సినిమా ఎక్కడ బోర్ కొట్టించకుండా ఉంది. కాబట్టి సూపర్ సక్సెస్ గా నిలిచింది.
మరి ఈ పుష్ప సినిమా కూడా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు సాగినట్టైతే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సుకుమార్ మాత్రం నిడివి అనేది ఈ సినిమాకి ప్రాబ్లం అయితే కాదు ఎందుకంటే మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకుడిని హుక్ చేసి తీసుకెళ్తుందనే కాన్ఫిడెంట్ లో ఆయన ఉన్నాడు.
తను ఇచ్చిన కాన్ఫిడెంట్ తోనే సినిమా యూనిట్ కూడా చాలా పకడ్బందీ ప్రణాళికతో డిసెంబర్ 5వ తేదీన థియేటర్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు అనే ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆయన కాన్ఫిడెంట్ లోనే సినిమా సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.
ప్రస్తుతానికైతే సుకుమార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి తను అనుకున్న విధంగా సినిమా ప్రేక్షకులకు రీచైతే మాత్రం భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని మూడగట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 5వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…