spot_img
Homeఎంటర్టైన్మెంట్Prema Entha Madhuram Serial: పెళ్లికి ఒప్పుకున్నా సుబ్బు.. అనుకి పరీక్ష పెట్టిన శారద!

Prema Entha Madhuram Serial: పెళ్లికి ఒప్పుకున్నా సుబ్బు.. అనుకి పరీక్ష పెట్టిన శారద!

Prema Entha Madhuram Serial: Subbu Agree For Anu Arya MarryPrema Entha Madhuram Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి ప్రేమ కథ నేపథ్యంతో ప్రసారమవుతుంది.ఈ సీరియల్ కు మంచి అభిమానం కూడా ఉంది. ఇక ఆర్య తన గతాన్ని మొత్తం పెళ్లి మండపంలో మీడియా ముందు అందరికీ చెబుతాడు. దీంతో ఆర్యపై అందరికి మరింత అభిమానం పెరిగింది. ఇక చివరికి ఆర్య.. తనకు అనుమతి ఇచ్చి పెళ్లి చేసే విషయంపై సుబ్బునే నిర్ణయించుకోమన్నాడు.

సుబ్బు ఇక బాధతో అక్కడ్నుంచి వెళ్ళిపోగా వెనుకాలే అను, పద్దు పరిగెత్తుతారు. అక్కడున్న ఆర్య తో పాటు అందరూ బాధపడినట్లు కనిపిస్తారు. మాన్సీ, నీరజ్ ఇప్పుడు ఈ విషయం గురించి చెప్పేది లేకుండే అంటూ బాధపడతారు. ఆర్య ఇది చెప్పాల్సిన బాధ్యత అంటూ సుబ్బు గారికి ఈ విషయం తెలియాలి ఇందులో తప్పు లేదనిపించింది అంటూ అని అంటాడు. మరోవైపు మీరా ఏం జరుగుతుందో అనే ఆలోచనలో ఉంటుంది. రఘుపతి కూడా పెళ్లి ఆగిపోయిందని బాగా సంబరపడుతాడు. ఇక అను ఏడుస్తూ ఎందుకు వచ్చావు నాన్న అని ప్రశ్నిస్తుంది. ఆర్య ప్రేమ గురించి, రాజనందిని గురించి అన్ని వివరించి చెబుతుంది.

ఇక చివరి నిర్ణయం మీరు ఏది చెప్తే అది చేస్తాను అన్నట్లు అను అనడంతో సుబ్బు ఆర్య దగ్గరికి వెళ్తాడు. ఇక జలంధర్ పెట్టిన మనుషులు ఏం లాభం లేదు అని జలంధర్ కి ఫోన్ చేస్తారు. కానీ అప్పటికే జలంధర్ వేరే గెటప్ లో మండపానికి బయలుదేరాడు. ఇక ఆయన పెట్టిన మనుషులు ఫోన్ చేసి చెప్పడంతో ఆల్రెడీ లైవ్ లో చూశాను అంటూ కోపంతో రగిలిపోతాడు. ఇక జలంధర్ ఇచ్చిన టాబ్లెట్లను చూస్తూ ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది మీరా.

మరోవైపు సుబ్బు ఆర్య దగ్గరకు వచ్చి ఎందుకు చెయ్యని తప్పులు బయటపెట్టుకున్నారు అంటూ అనేసరికి అందరూ నవ్వు ముఖంతో కనిపిస్తారు. మొత్తానికి సుబ్బు ఆర్య,అను ల పెళ్లికి ఒప్పుకోవడంతో మీరా, రఘుపతి షాక్ అవుతారు. ఇక అనుని రెడీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. తన ఫ్రెండ్స్ తనను ఆట పట్టిస్తుంటారు. అప్పుడే శారదా, మాన్సీ వస్తారు. ఇక శారద అనుని పెళ్లి మండపం తీసుకువెళ్లే ముందు అనుకు ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో అను అత్తారింటి జీవితంలో ఎలా ఉంటుందన్న దానిపై పరీక్ష ఉండగా అను అందులో గెలుస్తుంది. మొత్తానికి ఆర్య,అను ల పెళ్లికి సిద్ధం కాగా జలంధర్ వచ్చి ఏం చేస్తాడో అనే మరో షాక్ చూడాల్సి వస్తుందేమో.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper